మూలమున మరింత వ్యక్తమగుచున్నది. రాజకీయ స్వేచ్ఛలేనిది ఏయుద్యమమయినను, ఎటుల యభివృద్ధి జెంగజాలదో, రామమోహన లైబ్రరీకి గలిగిన యవమానము తెలుపకనే తెలుపు చున్నది. బెజవాడ ప్రజ లీసమయమున రామమోహన గ్రంథాలయముపై నభిమానము వహించి, గ్రాంటు లేని లోపమును పూర్తి జేసి, గాఢాభిమానము జూపి ద్రవ్యసహాయము సలి పెదరని నమ్మెదము. రామమోహన గ్రంథాలయము సత్వరాభివృద్ధిగాంచి, జ్ఞానవ్యాప్తి కధికమగు సేవ జేయుగాక యని కోరెదము.
నివేదికలు
"ఏలూరు" గో సంరక్షణ సమితియొక్క మూడవ నివేదిక అందినది. ఇది స్థాపింపబడిన 11 సంవత్సరముల నుండియు దినదినాభివృద్ధి గాంచుచున్నది. ఇంతవరకు దీనికి రు 18,824-1-2 లు శాశ్వత నిధి గలదు. 1-10-27 మొదలు 31-12-1928 వరకు దీనికి ఆదాయము రు 4,018-9-8 లు; వ్యయము రు 2,476-1-8. ఆదా
"వేటపాలెము” నందున్న సారస్వత నికేతనముయొక్క ఏకాదశ వార్షిక చరిత్ర అందినది. (5-10-28 మొదలు 80-9-29 వరకు) ఈ గ్రంథాలయమునకు రు 7,840 లు మూలధనము గలదు. మొత్తము రు 17,086-18-6 విలువగల ఆస్తి గలదు. ఈ కాలము నందు ఆదాయము రు 2,172 -8-5 లు; అంతయు వ్యయపడినది. ఇందులో ధర్మకర్తగారగు ఊటుకూరి వెంకటసుబ్బారాయ శ్రేష్ఠి గారి పెట్టుబడి రు 1,887-15-5 లుండుట గుర్తింపదగినది. వేటపాలెం యూనియన్ బోర్డు వారు రు 50 ల నిచ్చిరి. ఈ కాలమునందు పురుషులచే చదువ బడిన గ్రంధముల సంఖ్య 3,233; స్త్రీలచే చదువబడిన గ్రంధముల సంఖ్య 202.