Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.4 (1929).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహేతుక పూర్వకములైన అభినవజ్ఞాన శాస్త్రీయ గ్రంథ రచనలకు ప్రయత్నములు విరివిగా సాగించుచున్నారు. పాఠ్యగ్రంథ నిర్ణయ సంఘము వారుకూడ చేయూత నొసంగుచుండుట చేత కొలది కాలములో బ్రకృతివిషయ శాస్త్రీయ గ్రంథములు యుద్భవిల్లినవి. అయితే అది చాలదు. ఇంకను నెక్కువ కృషి యొనర్చునటుల కనబడుచున్నది.

బర్మారాష్ట్ర నిర్మాణ ఉద్యమమే బర్మీయులకు సకల ఆధునిక ఉద్యమములయందు పాల్గొనుటకు యుత్సాహ మొసంగుచున్నది. వారి సహజ అంధత్వమును వీడి యొక్క నూతన భావోద్రేకము వారి హృదయమున స్పందించుచున్నది. ఇప్పుడు యీ యుద్యమ ప్రచారమునకై "స౯" యను బర్మా దినపత్రిక బండులాయను వారపత్రిక తీవ్రపచారము సేయుచున్నవి. ప్రస్తుతము బహిరంగ యుపన్యాసము లెల్లను బర్మా భాషయందే యివ్వబడుచున్నవి. భాషావిషయమున తగవులు లేవు. భారతీయులవలె మతము నందు కులములందు కక్షులులేవు. స్త్రీలకు సమాన స్వతంత్య్ర ధర్మములు వెలయుచుండుట చేత బర్మీయుల ప్రయత్నావళి యనతికాలమున సాఫల్యము నొందునిని సూచించుటకు ప్రబల నిదర్శనములు గలవు.


- మా. సుబ్బరామయ్య





దక్షిణాంధ్ర క్షత్రియ గ్రంథాలయము, రాజపాళెయం

రామనాధపురంజిల్లా రాజపాళెయమున నుండు ఆంధ్రులమగు రాజపాళెయమున నుండు మేము మాతృభాషాభివృద్ధిని బొందుటకై మాతృభాషా పోషకులగు సుదారవంతులు ద్రవ్యసహాయముచే ది 16-6-29 తేదీన గ్రంథాలయమొండు స్థాపించితిమి. గ్రంథాలయ స్థాపనదినమున ఆంధ్ర గ్రంథములు 878, ద్రవిడ గ్రంథములు 199, తరువాత ఏనుగు వానిలంక హఠయోగాశ్రమ రాజయోగీంద్రులు పంపిన తెలుగు గ్రంథములు 60, నేలమునుంచి వీవింగు సూపరింటెండెంటు రామలింగస్వామిగారు పంపి