హస్త గతంబైన పిదసనే నా విమర్శక గ్రంథములు సహా కొంత క్షీణించినవి. 1882 వ సంవత్సరమున కమిషనర్ గానుండిన చార్లెస్ బర్నార్డు దొర గారు కు(Charles Bernard) దేశీయుల విద్యాభివృద్ధికై పాఠశాల నొకదానిని నెలకొల్పి దానికి దగిన పరికరములు సేకరించు సమయమున అధ్యాపకులకు సహాయ గ్రంథములతోను పరిశోధనకొఱకు కొన్ని గ్రంథ సంపుటములతోను నొకయనుబంధ గ్రంథ నికేతనము నెలకొల్పెను. కాలక్రమమున యాగ్రంథాలయము బర్నార్డు మహనీయుని నిరంతర కృషివలన విశేషాభివృద్ధి గాంచుటచే బర్నార్డు ధర్మ గ్రంథనిలయ మను నామముచే ప్రసిద్ధి కెక్కి యున్నది. ప్రకృతము నియ్యది బర్మా రాజ్యాంగపు వారి పోషణమున నున్నది. ఇదియే బర్మా దేశమంతటికిని కేంద్ర గ్రంథాలయము. భాండాగారమున రెండు మూడు వేల తాళపత్ర గ్రంథరాజములు గలవని గ్రంథ పేటికల మూలమున తెలియుచున్నది. దొరతనము వారి చేతను విద్వాంసుల చేతను సేకరింపబడిన గ్రంధ సంపుటము లన్నియు ముద్రితములుగాక పోయినను కొన్ని యైనను మరియే పుస్తకాగారము నందును లేనివి గలవని యా గ్రంథ భాండాగారి చెప్పెను. ఆ నికేతనమున నుండు సంపుటములను పండితులచే పరిశోధించి యపూర్వ పరిశీలనములు గ్రంథవివరములు విమర్శక వ్యాఖ్యానములు బర్మాపరిశోధక సంఘము వారి మూలమున ప్రకటితమగు మాసపత్రికయందు జర్చింపబడు చుండును.
ఇక్కాలమున దేశ భాషామూలక విద్య ప్రోత్సహింపబడు చుండినను గ్రంథముల జదివి రసమును గ్రహించువారి సంఖ్య యల్పమని చెప్పుటకు సంశయములేదని బర్మా సన్యాసి వుద్దండాగారు యాన ఇచ్చిరి. ప్రాథమిక విద్య నిర్బంధముగను యుచితముగను బ్రసాదించుటకు బర్మా విద్యాశాఖ వారివలన బ్రయత్నము లొనర్ప బడుచున్నవి. ఇంకను రూపు గనలేదుగాని శుభసూచకములు మెండుగా గానవచ్చుచున్నవి. వర్తమానకాలమున విద్యావిషయము లందు బర్మీయులు కొంత వెనుకబడియున్నారనఁట వాస్తవమైనను విద్యా నిధులగు ఆధునిక యుపాధ్యాయులవలనను నవీన పద్దతులయందు