Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.3 (1929).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడచిన 11 మాసముల కాలమందు 4,613 మంది పల్లెటూరు జనులకు గ్రంధముల సంపుటయేగాక, అనేక పల్లెటూరు పాఠశాలల వారికి పఠములను బొమ్మలను పరిశోధక గ్రంథములను పంపెను.

ఆ దేశమందు ప్రథమమున పల్లెటూరు గ్రంథాలయములు 1898 సంవత్సరమున స్థాపింపబడెను. అట్టి గ్రంథాలయములను స్థాపించుటకు చాల జిల్లాలు చట్టములను చేసెను. 245 తాలూకాలు తాలూకా గ్రంథాలయములను స్థాపించినవి. ఇవి తాలూకా కంతకును కేంద్ర గ్రంధాలయములుగ నుండి, శాఖా గ్రంథాలయములను గలిగియుండును. "క్యాలి ఫోర్నియా” యందుగల 58 తాలూకాలలో 46 కేంద్ర గ్రంథాలయములు గలవు. “న్యూజెర్సి” యందుగల 21 తాలూకాలలో మూడవ వంతు యందు పన్ను వేసి గ్రంథాలయములను స్థాపించుటకు ఏర్పాటులు జరిగినవి. ఈ కేంద్ర గ్రంథాలయములు ప్రజలయొక్క కోరిక వల్ల ఏర్పడును. వాని నిర్వహణమునకై స్వల్పముగా పన్ను వేయబడును. ఈరీతిగా గ్రంథములేగాక, బొమ్మలు, పత్రికలు, సినీమా ఫిలిములు, మాజిక్ లాంతరు పటములు ఇంకను అగత్యములగు ఇతర పరికరములును గూడ పల్లెలకు అందజేయ బడుచుండును. ఆ దేశము నందు పల్లెటూరులకు జరుగు గ్రంథాలయ సేవ మిక్కిలి జయప్రదముగా నున్నది.

విలాసార్దము యేర్పడిన ఉద్యానవనములు గూడ విద్యాభివృద్ధికి ఉపయోగపడునటుల జేయు ప్రయత్నములు ఆదేశమందు కడచిన 8 సంవత్సరముల నుండియు జరుగుచున్నవి. ఉద్యానవనముల కేతెంచువారు కూడ, చదువునందు ఎక్కువ అభిలాషను జూపుచుండిరి. అందుచేత ముఖ్యమగు వానియందు గ్రంథాలయముల నేర్పఱ అట్టిగ్రంథాలయములు స్థాపింపబడిన పిమ్మట వాని ఉపయోగము అమితముగా పెరిగిపోయినది.