విద్యాభివృద్ధియందు గల్గుచున్న లోపములను పరిసమాప్తి చేయుటకును, పాఠశాలలో ప్రవేశమునొందుటకు సావకాశము లేనివారికిని వానిని వదలిన వారికిని జ్ఞానాభివృద్ధిచేయుటకును, కావలసిన సాధన విధానమును నిర్ణయించుట ఈ రాబోవు గ్రంధాలయ మహాసభ యొక్క ముఖ్య విధిమైయున్నది. ఈవిధిని గమనించక గాని, సక్రమముగా నిర్వర్తించక గాని తరుణము పోగొట్టుకొనినచో, ఆంధ్రులు తమ ధర్మమును తప్పిన వారగుదురు. మన దేశమున అనేక కారణములవలన పార్టీలు పెచ్చుపెరిగినవి. జ్ఞానాభివృద్ధికై అన్ని పార్టీలవారును సమముగా అన్యోన్యసౌహార భావముతో, కృషి చేయవలసియున్నది. కావున తక్కిన యితర సభలు కొన్నిటిలోవలెగాక, ఈ సభను జయప్రదముగా చేయుటకు అందరును జాతి, మత, రాజకీయకము, విచక్షణ లేక దేశాభిమానులును భాషాభిమానులుకు తగు తోడ్పాటునిచ్చి దేశకళ్యాణము కొఱకై బద్ధకంకలగుదురని సవినయముగ విన్న వించు,
భవత్సేపకుడు
సూరి వెంకటనరసింహ శాస్త్రి
పల్లెటూరు గ్రంథాలయములు - అమెరికా
"మీరేమైన కోడిపిల్లలను కొనెదరా?” అని వృద్ధురాలగు నొక పల్లెటూరు స్త్రీ "క్లార్క్సడేలు" అను పట్టణ గ్రంథాలయమునకు ఒక ఉదయమున వచ్చి ప్రశ్నించెను. ఆమె వితంతువు. పొలములలో పనిజేసియు, కోడిపిల్లలను అమ్ముకొనియు కుటుంబమును ఎట్లో పోషించుకొను చుండెను. ఆమెబిడ్డలలో నొకరు ఒక గ్రంధమును కొని యియ్యమని అడిగెను, ఆగ్రంథాలయమొక పూటకూటి యిల్లని తలంచెను. కోడిపిల్లలను అమ్మగా వచ్చిన సొమ్ములోనుండి, కుటుంబమునకు గావలసిన వెచ్చములను కొని, ఇంక మిగిలిన ద్రవ్యము నుండి తనబిడ్డ కొక గ్రంథమును తీసికొనవలెనని ఆమెతలంపు. ఆ గ్రంథాలయము యొక్క. భాండాగారి మంచివాడు. కోరికగలవారికి అర్హమైన గ్రంథ