రాబోవు ఆంధ్రగ్రంథాలయ సభ
ఆంధ్ర సోదరులారా!
నవంబరు మొదటివారులో ఆంధ్రసభలు బెజవాడలో జరుగుననియు ఆసందర్భమున ఆంధ్ర గ్రంధాలయసభయు సమకూడుననియు తెలియుచున్నది. బెజవాడ కూడలిస్తానము గనుకనున్నూ ఆంధ్రదేశమున అనేక యుద్యమములు కృషి చేయుచున్నవి గనుక నున్నూ అఖిలాంధ్రసభలు అనేకము జరుగునని ఊహించతగిఉన్నది. ఈప్రకారము చూచినచో గ్రంథాలయసభకూడ తక్కిన చిల్లర సభలతోపాటు ఏ ఉదయముననో ఏ రాత్రిపూటనో జరిపి మామూలు తీర్మానములు ప్యాసుచేసి అంతము పొందించబడునని జ్యోతిపము చెప్పుట సాహసము కాదు. జరుగబోవునభ ఎట్లుగా పరిణమించు చున్నను కర్తవ్యము ఏదో వివరించుట విద్యుక్తధర్మము.
ఆంధ్ర దేశమున గ్రంథాల యోద్యమము ముప్పది సంవత్సరములు పై కాలమునుండి కృషి చేయుచున్నది. ప్రథమములో కేవలము అనధికారులచే ప్రారంభింపబడి వారలచేతనే అభివృద్ధి జెందినది. ఈ రాజధానిలో కేవలము ఆనుద్యోగీయులు నడపు గ్రంథాలయములకు ప్రభుత్వపు బొక్కసమునుండి విరాళమును ప్రధమములో సంపాదించినది (మద్రాసు) శాసననిర్మాణసభలో అప్పుడు ప్రజల ప్రతినిధిగానున్న మ.రా.రా.శ్రీ. కొండ వెంకటప్పయ్య పంతులుగారు (అప్పటికి వారికి దేశభక్త బిరుదు రాలేదు) ఆంధ్ర నాయకులు గదా. స్థానిక సంస్థలనుండి మొట్టమొదట సాలియానా గ్రాంటును సంపాదించినది. బెజవాడ రామమోహన ధర్మపుస్తక భాండాగారము ఆంధ్రదేశపుదే గదా. గ్రంథాలయమనగా కేవలము గ్రంథములు భద్రపరచు స్థల