ప్రభుత్వమువారివలన ఖర్చుచేయబడుచున్నది. విద్యార్థులు తమ స్వంత ద్రవ్యమునుకూడ వ్యయపరచుచున్నారు. ఇట్టిస్థితియందు విద్యార్థుల తబీతు పూర్తియైన పిమ్మట వారికి తగిన యుద్యోగము లభింపజేయని యెడల ఈద్రవ్యమును ఇట్లు వృధగా వ్యయపరచుట ఎందులకు?
ఆరవ మెట్టు
విద్యార్థిదశ పూర్తియైన పిమ్మట ఒక వ్యక్తి తన వృత్తియందు అభివృద్ధినిపొందుట, విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టుటతో పాఠశాలలును విడిచి పెట్టక అతను పిమ్మట తనవృత్తియందు అభివృద్ధి జెందుటను గూడ కనిపెట్టు చుండవలెను. ఇందువలన విద్యార్థుల కిచ్చుచున్న విద్యావిధానమును వృత్తుల నవలంబించుచున్న వారియొక్క అనుభవములనుబట్టి అభివృద్ధి జేయవచ్చును.
ఈ ఆరు మెట్లయందునుగూడ గ్రంథ భాండాగారి అమూల్యమైన సహాయము చేయగలడు. కొత్తగ్రంథములను పరిచయము జేయుటవలన వ్యక్తియొక్క అవసరములను బట్టి వృత్తులను గూర్చిన విషయములకు సంబంధించిన వ్యాసములుగల మాసపత్రికలను వారపత్రికలను, దినపత్రికలను పరిచయము చేయుటవలనను అమిత నహాయము చేయవచ్చును.
వివిధ విశ్వవిద్యాలయముల యొక్కయు, కాలేజీల యొక్కయు, ఇతరవృత్తి విద్యా పాఠశాలల యొక్కయు ఈ సంవత్సరపు క్యాటలాగులను సంపాదించి గ్రంథాలయమునందుంచి, కావలసిన వారికి అందలి విషయములను విప్పిజెప్పు చుండవలయును. ప్రథమమునందు వృత్తిలో ప్రవేశించు వారికి, ఉద్యోగము ఎట్లు దొరకునను విషయము అనేకమందికి గొప్ప సమస్య. ఈ విషయముమీద వ్రాయబడు వ్యాసములను ప్రతివత్సరమును చదువరుల దృష్టి నాకర్షింపబడు లాగున చేయవలయును. ఒకవృత్తియందున్న వాడు అందు ద్రవ్యము అభివృద్ధి కావలయునని తలంచుట యనగా ఆతడు తనవృత్తిని లేక ఉద్యోగమునందు ఇంకను ఎక్కువ ప్రావీణ్యతను జూపవలయు నన్నమాట. ఈ ప్రావీణ్యతను సంపాదించుట యందు సహాయము జేయుట గ్రంథాలయముయొక్క ధర్మమై యున్నది. ఇట్టి ప్రావీణ్యతను సంపాదించుటయందు ఉపన్యాస తర