Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.2 (1929).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గారి సందేశముతో ఈసభ ప్రారంభమాయెను. నాడు “హౌవరు" గారు 2,800 మంది ప్రతినిధులతో గలిసి ఫొటోగ్రాఫునందు కూర్చుని యుండిరి. ఆసభయందే హెూవరుగారిని అమెరికాదేశ గ్రంథాలయ సంఘ మందు గౌరవసభ్యులుగా జేసిరి. మరియు 'లీగ్ ఆఫ్ నేషన్సు” యొక్క గ్రంధభాండాగారి యగు “సీవెన్సుమా” గారు ఉత్తర ప్రత్యుత్తర సభ్యులుగా జేర్చుకొనబడిరి. మరికొన్ని యుపన్యాసములైన పిమ్మట ముందు సంవత్సరమునకు కార్యనిర్వాహకులు ఎన్నుకొనబడిరి. పిమ్మట ఈ క్రింది తీర్మానములు అంగీకరింపబడినవి.

తీర్మానములు

ఏబదియొకటవ సభ జయప్రదముగా జరుగుటకు కావలసిన ఏర్పాటులను చక్కగా చేసినందులకు ఆహ్వాస సంఘము వారికి ఈ సంఘము వారు వదనము లర్పించుచున్నారు.

అమెరికా దేశ గ్రంథాలయోద్యమమునకు అవిచ్ఛిన్నముగా విరాళముల నిచ్చి తోడుపడుచున్నందులకు కార్నీజీ కార్పొరేషను (న్యూయార్కు) వారి కీసభ వారు కృతజ్ఞతను వెల్లడించుచున్నారు.

విదేశములనుండీ ఈసభకు విచ్చేసిన గ్రంథభాండాగారికులకు ఈసభ వారు తమ సంతసమును వెలిబుచ్చుచున్నారు.


మిగత సభలు

ఆరురోజులు జరిగిన సభలో సమావేశములు నాలుగు మాత్రమే అగుపడుతవి. తీర్మానములుకూడా స్వల్పమే. మిగిలిన కాలమంతా ఏమి చేసిరి" అని చదువరులకు సందియము తోచి యుండవచ్చును. వారికి వట్టి తీర్మానములు చేయునలవాటు లేదు. పనియంతయు ఉపసంఘ సమావేశముల వలన జరుగును. అట్టి ఉపసంఘ సభలు ఈ ఆరు రోజులలో 77 జరిగినవి. దీనిని బట్టి ఆరోజులలో ప్రతినిధులకు చీమవాసి యంతైన తీరుబడి లేదను సంగతి గోచరము కాగలదు.