గుడ్డివారలకు గ్రంథాలయములు ఎక్కువగా తోడ్పడు విషయమును గూర్చి ముచ్చటింపబడెను. గ్రుడ్డివారలకు ఆ దేశమందు ప్రత్యేకముగా 15 గ్రంథాలయములు గలవు. అందలి గ్రంథములను చదువు చదువరులలో నూటికి 95 మంది, పోష్టుద్వారానో లేక టెలిఫోను ద్వారా కబురంపియో, గ్రంథములను తెప్పించుకొందురు. పాఠశాలలందలి గ్రుడ్డిపిల్లల కొరకై ప్రభుత్వమువారు 2,25,000 రూపాయలను వ్యయపరచిరి.
గ్రంథాలయోద్యమమునకై విశేషశ్రమను జేసిన హెన్రీ జేమ్నుకార్' అను నాయనయు ఆయన భార్యయు, కార్ గారికి జబ్బు చేయుటచే, ఈసభకు రాలేక పోయిరి. ఏబది సంవత్సరములనుండి ఈ సంఘ మందు సభ్యుడుగా నున్న కార్ గారు 8 సభలకు తప్ప మిగిలిన అన్ని సభలకును వచ్చి యుండిరి. ఈ రానిసభలలో మూడు ఆయన సభ్యుడు గాక మునుపు జరిగినవి. ఆయనకు ఆరోగ్యము గలుగ గోరుచున్నా మనియు, మరుసటి సంవత్సరము సంపూర్ణారోగ్యముతో చూడగోరు చున్నామనియు, సందేశమంపబడినది.
మూడవ సమావేశము
16 వ తేదీ ఉదయమున మూడవసమా వేశము జరిగెను. న్యూయార్కు నగరమందున్న ప్రెసిడెంటు గూస్ వెల్టు గ్రంథాలయమును గూర్చి ఉపన్యాస మియ్యబడెను. ఈసభ జరుగు చున్న వాషింగుటను పట్టణచరిత్రకు సంబంధముగల జార్జి వాషింగుటను యొక్కయు, అబ్రహాము లింకోలను యొక్కయు, చరిత్రలు సంస్మరింపబడెను.
అమెరికా దేశ గ్రంథాలయ సంఘమునకు బాల శాఖయొకటిగలదు. ఆవత్సరము తయారైన గ్రంథములలో పసిపిల్లలకు ఎక్కువ యోగ్యముగానుండు గ్రంథమునకు యీశాఖ వారొక పతకమును ప్రతిసంవత్సరమును ఇచ్చెదరు. ఈవత్సరము ఈపతకము “ట్రంప్రెటర్ ఆప్ క్రాకో" అనుగ్రంథమున కీయబడినది.
నాల్గవ సమావేశము
నాల్గవ సమా వేశము 18 వ తేదీ ఉదయమున జరిగినది. ఇదియే ఆఖరి సమావేశము. అమెరికా దేశ అధ్యక్షులగు “హెూవరు”