Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లందు గ్రంథాలయ పద్ధతులందును, పరిపాలనయందును అభివృద్ధి ఏమాత్రమును లేడని తలంపుడు. నేడు అమెరికా దేశఘు యొక్క స్థితి ఏరీతిగా ఉండి యుండును?

కొన్ని గ్రంథాలయములు ఈ దేశమందు గూడ బయలు దేరి యుండి యుండును ౼ కాని వానియొక్క పదునారు పదునేడు శతాబ్ద పరిపాలనా పద్ధతులు, వాని నుపయోగించు కొద్దిమంది అదృష్టవంతులకుగూడ వానియొక్క విలువను సంకుచితపరచి యుండును. నేడు మన మెరిగియున్నట్టి ధర్మ గ్రంథాలయములు, పాఠశాల గ్రంథాలయములు, ప్రత్యేక గ్రంథాలయములు బయలు దేరక నేయుండి యుండును. జనసామాన్యము గ్రంథాలయముల తోడ్పాటు లేక నేయుండి యుందురు.

అట్టి స్థితిగతులందున్న అమెరికా దేశమునకును ఇప్పటి అమెరికా దేశమునకును విశేష వ్యత్యాసము కలిగి యుండుననియు, అభి వృద్ధికరములగు గ్రంథాలయ మార్గములును అందరికిని పుస్తకము లందుబాటులో నుండు ఏర్పాటులును ఈ దేశమునందు గలిగిన సత్యరాభివృద్ధికి స్త్రబలమైన కారణములనియు దీనివలన తేలినది. ప్రఖ్యాతిని వహించిన అనేకమంది అమెరికా దేశస్థులు తమ విద్యాభివృద్ధికిని తమజీవితములందు పొందిన ప్రావీణ్యతకును, గ్రంథాలయములందు లభించిన సావకాశములే మూలకందములని అంగీకరించెదరు. (అట్టివారి పేరులు చాల ఇయ్యబడినవి. వారిలో అమెరికా దేశ కోటీశ్వరుడును దానకర్ణుడును అగు ఆండ్రూ కార్టీజీ గారి పేరుగూడ గలదు). గ్రంథాలయముల ఉపయోగమువలన ఎంతమందికి సున్నితమార్గములును, సమయ స్ఫురణములును లభించినచో ఇక్కడనున్న ప్రతివారును లెక్కించి చెప్ప గలుగుదురు. ఇంక మనసంగతేమిటి? గ్రంథాలయములు కొనివచ్చిన పుస్తక సాంగత్యము లేనియెడల వ్యక్తిగతాభి వృద్ధియందు మన మందరమును ఎంత వెనుకబడియుండి యుందుమో? మనకు గ్రంథాలయములను గ్రంథలయ గ్రంథాములును లేనియెయడల మనకు మనోదృట్టి సంకుచితమై యుండును. మన బాధ్యతలు -