అమెరికా దేశ గ్రంథాలయ సభ
అమెరికా దేశమందు ధర్మ గ్రంథాలయ సంఘము ఏర్పడి ఏబది సంవత్సరములు దాటినది. అప్పటినుండియు ప్రతివత్సరమును, ధర్మ గ్రంథాలయ సభలు జరుగుచు, ఈయుద్యమాభివృద్ధికై విశేషముగ దోడ్పడినవి.
ఈవత్సరము ఏబదియొకటవ సభ మేనెల 13వ తేదీ మొదలు 18 వ తేదీవరకు "వాషింగుటను" పట్టణమందు జరిగినది. ఈసభకు రమారమి 3,000 మంది ప్రతినిధులు విచ్చేసిరి. అనగా అమెరికా దేశ గ్రంథాలయ సంఘ సభ్యులలో నాల్గవవంతు సభ్యులు హాజరైరి. 13 వ తేదీ సాయంకాలను సభ ప్రారంభమాయెను.
ఆహ్వానము
ఆహ్వాన సంఘాధ్యక్షులగు జడ్జి వెండల్ ఫిలిప్సుగారు ఈరీతిని ప్రతినిధుల నాహ్వానించిరి:—
“ప్రపంచమునందెల్ల సౌందర్యవంతమును, మీదియును మాదియును నగు నీ "వాషింగుటను” పట్టణము నకు కొలంబియా జిల్లా ధర్మ గ్రంథాలయ పక్షమున మిమ్ములను హృదయపూర్వకముగ ఆహ్వానించుచున్నాను. ఈ దేశమునందు ఇదే విస్తీర్ణముగల పట్టణముల యందెల్ల, “వాషీంగుటను” పట్టణమునందు, తక్కువ గ్రంథాలయములును ఎక్కువ వివేకమును గల వని కాంగ్రెసు కమిటీలకు మా గ్రంథ భాండాగారి ప్రదర్శింపుచుండెను. ఈవిషయమును బట్టి “ఏమి యూహింపవలె” నను విషయము ప్రతివత్సరమును చర్చకు వచ్చు చున్నది. అందుచేత నీ సభ జరుగుటకు ఈపట్టణము మిక్కిలి తగి