Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభ్యులలో చాలమంది అమెరికా దేశ గ్రంథాలయ సంఘము నెడల ఎంత గాఢాభిమానమును గలిగియున్నారో, దాని అభివృద్ధికై ఎట్టిదక్షతతో పాటు బడుచున్నారో బోధపడగలదు. వ్యక్తిగతముగను, ఉపసంఘసభ్యులుగను ఈసంఘపక్షమున జేయుసేవతో తృప్తిని వహింపక చాలమంది సభ్యులు చేయవలసిన పనిని గురించి తారతమ్యతతో చింతని జేసి, ముందువెనుకల ప్రారంభింప వలసిన పనులను గూర్చి నిర్ణయించు చుండెదరు. ఇట్టి వారియొక్క అభిమానము లేకుండ నిర్వహింపబడిన మహత్కార్యములు చాల భాగము నెరవేరి యుండవు.

గడచిన కొద్ది సంవత్సరములలో నిర్వహింపబడిన పనులలో ప్రధానమైనవి, “కార్నీజీ కార్పరేషను” వారును తడితరులును ఈ పనులకై ప్రత్యేకించి యియ్యబడిన గ్రాంటుల వలననే నెరవేరినవి. ఇట్లు నిర్వహింపబడిన వానిలో కొన్ని:-గ్రంథాలయ శోధన, గ్రంథ భాండాగారత్వమునకు గావలసిన చదువునకు గావలసిన గ్రంథనిర్ణయము, ఈడు ముదిరినవారికి గ్రంథాలయము చేయదగిన పనిని గూర్చిన నిర్ణయము, చదువదగిన గ్రంథముల యొక్కయు చదువు అలవాటుల యొక్కయు పరిశీలన, ప్రత్యేక ఆశయములతో చదువు పద్ధతులు, వరదవచ్చిన ప్రదేశముల గ్రంథాలయముల పునర్నిర్మాణము, అంతర్జాతీయ గ్రంథాలయ సహకారము, ప్యారిసునందున్న గ్రంథాలయ పాఠశాల. ఈ ఏర్పాటులయందు కొన్ని పూర్తియైనవి; మరికొన్ని పూర్తికానున్నవి. ఈ విషయమై పనిజేయని కొందరి విమర్శనలు ఎట్లున్నను, వీనిని త్యెజించుటకు మనలో ఎవరైని అంగీకరింతుమా? గ్రంథాలయ శోధన సంపుటములు తయారు జేయుటకు పంపబడిన పరిశోధన ప్రశ్నల కుత్తరువుల నిచ్చి దానివలన బాగుపడని గ్రంథాలయ మొక్కటియైన కలదా ? ఆ సంపుటములను జూచి ఇతర గ్రంథాలయములను గూర్చిన వివరములను తఱచు తెలిసికొనుచుండ