Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందుచేత జనసామాన్యముయొక్క దృష్టినంతను గ్రంథాలయము వైపునకు దిప్పుట మన అందరియొక్క విద్యుక్తధర్మము. నీగ్రంథాలయమునకు నీవు పని జేయుట యనగా నీకక్షిదారులందరికి పని జేయుట; ఆకక్షిదారు లందు దగ్గరనున్న ఒక పాఠశాలగాని, లేక విశ్వ విద్యాలయముగాని, ఒక పట్టణముగాని, ఒక తాలూకా గాని చేరియుండవచ్చును. మన గ్రంథాలయమును చేయదగినంత ఉపయోగకరముగ చేయదలంతుమేని, మనకక్షిదారులతో మనము ఐక్యము కావలెను. వారి యక్కరలే మన యక్కరలకింద చేసికొనవలెను; ఇట్లు చేయుట యందే మన తెలివి తేటలు, మనయందుగల పొందిక, మన యోగృత పరీక్షకు వచ్చును.

మన గ్రంథాలయముయొక్క క్షేమమునకు బిమ్మట మన అమెరికాదేశ గ్రంథాలయ సంఘము యొక్క అభివృద్ధిని గూర్చి యోచింపవలెను. గ్రంథాలయ సేవను, గ్రంథ భాండాగారత్వమును అభివృద్ధి జేయుటయే ఈ సంఘస్సు యొక్క ప్రధాన అభిప్రాయములు. ఈ సంఘమునందు స్త్రీ పురుషులందరును గలిసి పదకొండు వేల మంది సభ్యులు గలరు. వీరందరును చేరి తమ ఉద్యోగ విషయములను అనుభవములను అంతను చేర్చి కూడబలుకుకొని, తమ అనుభవములను అందరియొక్క క్షేమమునకై వినియోగింప పాటుబడెదరు. ఈ సంఘమనకు శాఖలుగానున్న అరువదికంటె ఎక్కువ సంఖ్యగల ఉపసంఘముల సభ్యులుగా ఈ సంఘము యొక్క పెక్కువందల సభ్యులు పనిచేయుచున్నారు. ఈ సంఘముయొక్క ప్రధాన కార్యాలయమందు ఏబది కంటె ఎక్కువమంది ఉద్యోగులు పని జేయుచున్నారు. ఈ సంఘము యొక్క సేవ సభ్యులకు మాత్రమేగాక, గ్రంథాల యోద్యమవ్యాపనమునకు గూడ వినియోగింప బడుచున్నది. ఉపసంఘములయొక్క నివేదికలును ఈ సభయొక్క వివుల కార్యక్రమమును చదివిన యెడల,