అక్కడ టీకాలకై ఒక మందును తయారు జేయు చున్నారు? దానికై అనే కరకముల సూక్ష్మజీవులను ఏరకమున కారకము వేరు జేయుచున్నారు ఒక రకము రెండువంతులు, ఇంకొక రకము మూడు వంతులు, వేరొకరకము రెండు వంతులు, ఈరీతిగా వేరుచేయబడిన వానిని తిరిగి కలిపి మందును తయారుజేయుచున్నారు. పోల్చి చూచిన యెడల గ్రంథాలయ మందు జరుగు కార్యక్రమమేదియును ఇంత చిక్కుగాను విసుగుదల ఉండదు. మానవులచే నవలంబింపబడు ఏవృత్తియైనను మనవృత్తితో సరిపోల్చుటకైన సావకాశము లేకపోవుట యేగాక, ఇందు అందరును వాంఛింపదగిన అనేక మంచిహంశములు గలవు. “బోధన” ను గూర్చిన ఒక వ్యాసమునందు ఇట్లు వ్రాయబడియున్నది:౼ “ఏవృత్తినైన స్థిరముగ నవలంబించిన యెడల ఒక వ్యక్తి యొక్క అక్కరల వ్యాప్తినది సంకుచిత పరచును. హృదయము యొక్క ఆర్ద్రదృష్టి నది తగ్గించి వేయును; మరియు నాతని నొక పరిపాటికి దాసునిగా జేయును.” కలుగ జేయునదిగాను
ఈవాక్యములు ఇతరవృత్తుల కేమైన చెందునేమోగాని, గ్రంథాలయ వృత్తికి మాత్రము ఎంతమాత్రమును చెందవు.
గ్రంథాలయ నిర్వాహకులు నిరంతరము మార్పు జెందుచున్న స్థితిగతులకును, ఆవశ్యకతలకును తమ ప్రతిష్ఠాపనలు వెనుకబడకుండ జూచు కొనవలయును. కార్యనిర్వాహకత్వమునందేమి – మరి యేయితర స్టితియందేమి - మనము ఏపనికైతే జవాబుదారిని వహింతుమో, దాని యందు యధార్థమైన అభివృద్ధిని జూపుటయందే మనదృష్టిని కేంద్రీకరింపవలెను. ఇట్లు జరుగుటకు సాధారణముగా ఇతర పనివారలతో పొఁదికగా కలిసి కార్యమును నిర్వహింప వలసియుండును. అనగా ఉపాయముగా కార్యక్రమమును ఏర్పరిచి, ఇతరులతో సహకారము జేయుట. గ్రంథాలయ నిర్వాహకులందరును ఉన్నతభావనలతో తమ కార్యసరణిని జరుపవలెను. వీధిలో తిరుగుచున్నప్పుడు, మన మందరమును గూడ మన మన గ్రంథాలయముల ప్రతినిధుల మేను.