ముఖ్య కార్యనిర్వాహకులు ఈ సంఘ సభ్యులే. మనదేశమందలి ఇతర బాలభటోద్యమములకును, యాంధ్ర యుద్యమమునకును గల ముఖ్యభేద మేమనగా ఆంధ్రోద్యమము ప్రభుత్వోద్యోగులకు సంబంధము లేకుండనే ఉద్భవిల్లినది అభివృద్ధిని గాంచినది.
రెండవ యంశము: అన్ని మతముల వారలకు సమానముగ యాదరణ ముండునట్లును, మన దేశమం దుద్భవించుచున్న నానా రాజకీయ పక్షములలో ఏకవారితోను ఏకీభవించక అందరికిని సామాన్యమగు ఆశయములు సంసిద్ధికొరకును ఈ సంఘము ప్రధమము నుండియు కృషి చేయుచున్నది. ఈ సంస్థయొక్క యాదరణ కింద హిందూమత ప్రవక్తల యొక్కయు పుణ్యపురుషుల యొక్కయు వర్ధంత్యువ్సవము లెట్లు జరుపబడుచున్నవో అట్లే మహమ్మదీయుల పండుగలు కూడ జరుపబడుచున్నవి. ఇందుకు అన్నిటికన్న ఈ సంఘము ఎవరి యశస్సును గానము చేయుటకు స్థాపించబడెనో అట్టి శ్రీరామ మోహనరాయలే ప్రధమసాక్షి. ఇందువలననే సర్వపక్షముల వారును, అన్ని వృత్తులందున్న వారును ఈ సంస్థ యొక్క అభివృద్ధికొరకు ప్రప్రధమము నుండి కృషి చేయుట తటస్థించుచున్నది. ఇకముందుకూడ ఇందుకు భిన్నముగా జరుగుటకు కారములు లేవు.
మూడవయంశము: – జ్ఞానము అనంతము, మనుజుడు ఆమరణాంతము సంపాదించుట కుద్యమించవలసినది. ప్రజలు నానా విధమగు శక్తులు, వివిధరుచులు, వేరు వేరు తెలివి తేటలు, అసంఖ్యాకములగు పరిస్థితులతోను యున్న వారు కావున ప్రజల జ్ఞానాభివృద్ధి కొరకు వర్ధిల్లెడి ప్రతిస్థాపనలలో ప్రధానమగు ధర్మగ్రంథాలయమందు వివిధాంతరములు గల ప్రజలకు వారివారి కనువగుమార్గముల ననుసరించి జ్ఞానోపార్జనముకు తగిన సాధన విధానములు నవలంబించుట ముఖ్యకర్తవ్యము. అంతకన్న ముందు ప్రజల నందరును అచ్చటి కాకర్షించు పనిగూడ ధర్మగ్రంథాలయ విధియే. ప్రాచీన కాలమందు మన దేశ మందిట్టి సంస్థలుండి . మన దేవాలయము లిట్టివి. మన సాంఘికోత్సవము లిట్టివి మన గ్రామసంఘము లిట్టివి. వీని యన్నిటికన్నను ప్రతిదినము గ్రామస్థులందరు తమతమ వృత్తులకు సంబంధించిన పనులన్నియు తీర్చు