Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.9 (1929).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వపు విజ్ఞానము పునరుద్ధరించ బడవలయును. ఇట్టి ఆశయములతో ఈ గ్రంథాలయము స్థాపించబడి పనిచేయుచున్నది. ప్రయోజనము స్థాపించిన వారి ఆశయములను బట్టి యేర్పడును. సంపూర్ణ పరిజ్ఞానము గలవారు గ్రంధాలయపాలకుడుగ నుండుటవసరము.

మనము ఆంధ్రవాఙ్మయ చరిత్రము పరిశీలించితిమేనియే యుగము నందైనను మతము వేదాంతము మనల నాకర్షించినటుల విదితమగుచున్నది. ఐదేండ్లనుండి ఆంధ్ర వాఙ్మయ చరిత్రను తయారు చేయున్నాను. 12000 అచ్చు అయినట్టివి, 15000 అముద్రితములయి నట్టియు గ్రంథములు గలవు. ఈ వాఙ్మయమును బట్టి చూచితిమేని ధర్మముమీద, మతముమీద, ఆంధ్రులకు అభిలాష మెండుగనున్నట్లు స్పష్టపడుచున్నది. పెద్దన మనుచరిత్ర యందు ధర్మజ్ఞానముల సమన్వయము కుదిర్చినాడు. భక్తిజ్ఞానముల సమ్మేళన మొనర్చినాడు. సజీవులైన ప్రజలలో భాషయందు మార్పు జరిగి తీరును, అయితే పూర్వాపర సందర్భముల ననుసరించి మార్పు అవసరము. భావసంశుద్ధిగల వాఙ్మయ నిర్మాతలు భాషను సంస్కరించగల అధికారులై యున్నారు. అంతియేగాని ఏ కొద్దిగనో తెలుగును చదివి భాష సంస్కరించ గలుగుదు మనుట సరియైన పనికాదు. ఏది ఎట్లున్నను సంపూర్ణ స్వరాజ్యము సిద్ధించిన గాని సంపూర్ణ నిర్మాణశక్తి మన కలవడదు. మన ప్రబంధకర్తలు 300 ఏండ్లనుండి గుడ్డిగ ప్రాతమార్గముల ననుసరించుచున్నారు. అస్వతంత్య్రంతయే యిందులకు కారణము. మనము స్వతంత్రులమైనచో పూర్వాచారము వదలి నూతన వికాసమును స్పష్టించ గలుగుదుము.

గ్రంథాలయమును గూర్చి యొక్క మాట చెప్పుచున్నాను. గ్రంథాలయమును సోషల్ క్లబ్బుగ మార్చకూడదు. రెంటి ఆశయములు వేర్వేరు. గ్రంథాలయమునందు పత్రికాపఠనము గ్రంథ పరిశీలన, సంఘసేవ, దేశ సేవ, ప్రధాన కార్యములు. కృష్ణ వరదల సందర్భమున రామమోహనగ్రంధాలయ మొనర్చిన సేవ ప్రశంసనీయము. ఈభవనము పూర్తికాలేదని కొందరు చెప్పిరి. త్రివిక్రమరావుగారు పాశ్చాత్య దేశమునందలి గ్రంథాలయములకు గల మహా "