కాలములోనే మన భవనమున రెండవ అంతస్తును చూడగలమని నమ్ముచున్నాము.
గ్రంథాలయముయొక్క కొరతలు:-
గ్రంథాలయముయొక్క రెండవ అంతస్తు పూర్తిచేయుట ముఖ్యమయినపని. అది పూర్తి అయిన గాని కొత్తపుస్తకములను చేర్చుటకుగాని భాండాగారపు పుస్తకములను గ్రంథాలయమువద్ద చదువు జనులకు తగిన సౌకర్యముల నేర్పరచుటకు వీలులేదు. తరువాత గ్రంథాలయు చుట్టు ప్రహరీగోడ, కుర్చీలు, బీరువాలు, అత్యంతావశ్యకమయి యున్నవి. పై కార్యములు అన్నియు మహాజనుల ఔదార్యము వలననేగాక వేరువిధమున నెర వేర్పబడజాలవు. కావున మహాజనులు పుస్తకముల నొసంగుట మూలముగను ద్రవ్యసహాయము చేయుట మూలముగను తోడ్పడవలయును.
గత సంవత్సరము చందాలవల్ల 533-14-0 లున్ను, బెజవాడ మునిసిపాలిటి వారివల్ల రు 480-0-0 లున్ను పుస్తుకములను కొనుటకుగాను దొరతనము వారు యిచ్చిన రు 200-0-0 లున్ను వసూలు ఆయినవి.
కృతజ్ఞత:౼
మాభాండాగారమునకు ప్రప్రథమమున తమవద్దనున్న గ్రంథముల నన్నిటి నిచ్చి భాండాగార స్థాపన కాధారభూతులయిన శ్రీ బెజవాడ ప్రార్థనా సమాజమువారికిని, మొదటినుంచి యీభాండాగారము వృద్ధిపొందుటకు పెక్కు విధముల తోడ్పడుచు భాండాగారమును ఋణబాధనుండి తొలగించిన పెద్దలకును మా గ్రంథాలయాభివృద్ధికై మొదటినుండియు విశేషముగా పాటుపడిన మా కధ్యక్షులుగ నున్న శ్రీ సూరి వేంకటనరసింహ శాస్త్రిగారికి, మా కార్యదర్శిగారయిన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య పంతులుగారికి ఈ భాండాగారముయొక్క కోరతలన్నియు దీర్చి చాలవరకు తోడ్పడిన శ్రీ గోపరాజు బ్రహ్మానందంగారికి, శ్రీ బొడ్డపాటి వెంకటప్పయ్య పంతులుగారికి, శిష్టా వేంకటకృష్ణయ్య పంతులు గారికి, శంకర వేంకట రామయ్యగారికి, వేలమూరి గోపాలకృష్ణయ్య గారికిని, 3