ఈ గ్రంథాలయము అప్పటికి రిజిష్టరు అయి వుండకపోవుటచే కొన్ని చట్టముల నేర్పరచి 8-4-13 వ తేదీన కృష్ణాజిల్లా రిజిష్ట్రారు వారి ఆఫీసునందు 1860 సం. 21వ నెంబరు ఆక్టుప్రకారము రిజిష్టరు చేయబడెను. తరువాత నివేశన స్థలమును సంపాదించవలెనని తలచుచుండగా యీగ్రంథాలయము రిజష్టరు చేయబడిన రెండుదినములకే అనగా 10–4–1913 వ తేదీన బెజవాడ మునిసిపాలిటీవారు నివేశన స్తలములను వేలమునకు విక్రయించెదమని ప్రకటించిరి. అప్పుడు 2191 చ॥గలు గల యీస్తలము రు 3424-2-3 లకు కొనబడెను. ఈ భాండాగారమునకు అప్పటికి మూలధనమేమియు లేకపోవుటచే మునిసిపాలిటీవారికి స్తలము ఖరీదుకొంద ఈయవలసిన రు 3424-2-3 అప్పుగా తీసికొనివచ్చివారికి చెల్లింపబడెను. యీ అప్పుగా తీసికొనివచ్చిన సొమ్ములో కొంతభాగము చందాలవల్ల వేయబడెను.
నివేశన స్తలము కొనినపిదప భవనము నిర్మింపవలసియుండుటచే శ్రీ తిరువూరు రాజా గారి వద్దకు బోయి వారి వాగ్దానము చెల్లింపవలసినదని కోరగా వారందుల కియ్యకొనిరి. అప్పుడు మద్రాసు గవర్నరుగారి కార్యనిర్వాహక సభయందు సభ్యులుగ నుండి ఘనతవహించిన సర్.పి.యస్.శివస్వామిఆయ్యరు గారిచే 1-9-1913వ సంవత్సరమున పునాదిరాయి వేయబడెను,
ఇంటిఅద్దె నెలకు రు 20 చెల్లించుటకు కష్టతరముగ నుండుటచే ప్రధమమున ముందుభాగమున రెండు గదులనుమాత్రము తయారు జేసి 22-2-15 వ తేదీన భాండాగారము యిచటికి మార్చబడెను. నాటి నుండి భాండాగారము యీభవనమునందే యుండి, యీభవనము ప్రస్తుత స్థితికి క్రమక్త్రమముగా తీసికొని రాబడెను.
1. గ్రంథముల సంఖ్య. గ్రంథాలయము ప్రధమమున 1911 వ సంవత్సరమున జనవరి నెలలో 200 గ్రంథములతోను, 8 గురు సభ్యులతోను స్థాపింపబడెను. 1918 వసంవత్సరమునకు 1000 పుస్తకములున్ను మాసమునకు 60 రూపాయలు చందా చెల్లించెడి 120 మంది సభ్యులతోను తేజరిల్లినది. 1924 సంవత్సరమునకు 2356 ఆంగ్ల గ్రంథములున్ను 1618