ఇంగ్లాండు దేశము - కేంద్ర గ్రంథాలయములు
ఇంగ్లాండు దేశమున కంతకును లండను నగరమునందొక గొప్ప కేంద్ర గ్రంథాలము స్థాపింపబడినది. ఆ దేశమందున్న మారుమూలల నుండి కూడ పల్లెగ్రంధాలయముద్వారా, ఎవరైన తనకు కావలసిన గ్రంథమును కేంద్ర గ్రంథాలయమునుండి తెప్పించుకొనవచ్చును. ఈరీతిగా కేంద్ర గ్రంథాలయమునుండి తెప్పించుకొను పుస్తకముల సంఖ్య అమితముగ బెరిగిపోయినది. ఈ పెరిగిపోయిన అవసరమును అనగా 500 పల్లెటూరి గ్రంథాలయములకు కావలసిన గ్రంథములను సప్లయిచేయుటకు కేంద్ర గ్రంథాలయమునకు సాధ్యముగా కుండెను.
ఇట్టిస్థితిగతులయందు ఏమి చేయదగునని ఆ దేశమందలి గ్రంథాలయముల ప్రతినిధు లందరును సమావేశమై యోచించిరి. పల్లెటూరి గ్రంథాలయమువారు ఖరీదు ఎక్కువనే కారణము చేత గాని, దానిని ఎక్కువమంది చదువరనే కారణము చేతగాని ఏ దేని పుస్తకమును కొనజాలనియెడల, అట్టిగ్రంథమును కేంద్ర గ్రంథాలయమువారు పల్లెటూరు గ్రంథాలయమునకు సప్లయి జేయవలసియుండును. ఇందులకై అక్కడక్కడ జిల్లా కొక మండల గ్రంధాలయమును స్థాపించి, పల్లె గ్రంథాలయములు తమకు కావలసిన గ్రంధములను మండల గ్రంథాలయముల నుండి తెప్పించుకొనుటయు, మండల గ్రంథాలయములు తమకు కావలసిన - గ్రంథములను కేంద్ర థాలయమునుండి తెప్పించుకొనుటయు జేసిన బాగుండుననియు అందరికిని కావలసిన గ్రంథములు సులభముగా అందుబాటులో నుండుననియు నిశ్చయించిరి. ఇట్లు జేయుటవలన మండల గ్రంథాలయములు తమదగ్గర ఉపయోగింపకుండ వృథాగా నిలచియుండు గ్రంథములను ఉపయోగింపగలుగుటయు, కేంద్ర గ్రంథాలయముసు వారు తమకు మండల గ్రంధాలయములవలన గలిగిన విశ్రాంతి వలన తమ గ్రంథ సముదాయము సభివృద్ధి జేసికొనగలుగుటయు సంభవమగును. దీనికిగాను మండలగ్రంథాలయములు పుస్తకములన్ని సిగలిపి, ఒకే గ్రంథముల పట్టికను తయారుజేసి, దానిని పల్లెటూరు గ్రంథాలయము లన్నింటికిని, సప్లయి చేయుటవలన ఎవరికి గావలసిన పుస్తకములను వారు సులభముగా చెప్పించుకొనుటకు అందుబాటులో నుండును.