కుల భారముగూడ గలదు. ఈ రెండింటిని, నిపుణతతో నిర్వహించుట యందే ఆతనిసామర్ధ్యము, అతనియందుంచిన విధినిర్వహణము నిర్ణయింపబడును.
గ్రంథముల పరిచయము:
గ్రంథ భాండాగారి తాను సేకరించిన గ్రంథములను గూర్చియే గాక, అప్పుడప్పుడు వివిధ విషయుములను గూర్చి ప్రకటింపబడు గ్రంథములను గూర్చిగూడ తెలిసికొనియుండవలెను. దృష్టాంతరము: మాశాంతిని కేతన పాఠశాలకు కావలసిన పుస్తకముల నేర్చుకొనుటకుగాను, పిల్లల కొరకు ప్రకటించబడు పుస్తకము లన్నింటిని గూర్చి తెలిసికొని యుండవలయును. గ్రంథాలయములన్నియు ఇట్టిపనికి తోడ్పడవలెను. ఆయా విషయములయందు ప్రఖ్యాతిగన్న గ్రంథముల పట్టికలను సేకరించుటవలన ఈపని కాగలదు. ఈ కార్యనిర్వణహమునందు ఒక గ్రంథాలయము నిమగ్నమై యున్నటుల వెల్లడియైనచో, గ్రంథ ప్రకాశకులందరును కొత్తగ్రంథముల పట్టికలను వాని విషయ వివరణములనుపంపి, ఆగ్రంధాలయమునకు తోడ్పడుదురు.
అఖిల భారతగ్రంథాలయసభ:
తుదకు అఖిలభారత గ్రంథాలయసభకు నాదొక సూచనగలదు. ఆంగ్లేయభాషలో బయలు దేరిన ముఖ్యములగు వైజ్ఞానిక సారస్వత చారిత్రక గ్రంథములయొక్క జాబితాలను, మూడుమాసములకో - అర్థ సంవత్సరమునకో - అధమము సంవత్సరమునకో - ఒకమారు తయారుజేసి ప్రకటించు విషయమును గూర్చి ఈ సభవారాలోచింపవలెను. దేశమందంతటను గ్రంథాలయములను స్థాపించి, అభివృద్ధిపరచుట ఈ సభ యొక్క ఉద్దేశమగునేని సేకరింపవలసిన గ్రంథముల మార్గదర్శికల నొసంగుట చేత, ఆయుద్దేశము సఫలముకాగలదు. గ్రంథసంపాదన గ్రంధరక్షణయు మాత్రమేగాక, గ్రంథాలయ ప్రధాన కార్యమగు గ్రంథ పరిచయమునకును అప్పుడే సహాయము కాగలదు. గ్రంథములందలి విషయములయందు కుతూహల మేర్పడగలదు.