నకు గాక ఒక్కొక్కటియు ప్రత్యేకాధిక్యమును కలదిగా నుండవలెను. అందు గ్రంథభాండాగారి నిరుద్దేశపూర్వకమగు అర్చనాశక్తిగలిగి, గ్రంథాలయమును కేవలము నిండించుటయందే అభిమానములేక, వాస్తవముగ అనవసరములగు పుస్తకములను విసర్జించు వివేచనశక్తిని కలిగియుండవలెను. దానియొక్క గ్రంథ భాండాగారికి గృహమేధి గుణము లుండవలయను. కాని ఉగ్రాణపు కావలివాని గుణము లుండకూడదు.
ఉదాహరణము:
స్వదేశమందును విదేశములందును ప్రకటింపబడు పత్రికలను తెప్పించుచున్న ఒక గ్రంధాలయమును ఉదాహరణనిమిత్తము తీసికొందము. ప్రతిపత్రికలో ప్రత్యేక మాకర్షవంతములగు వ్యాసములను ప్రత్యేక మొకగ్రంథాలయ నిర్వాహకుడు ఎల్లప్పుడును పరిశీలించుచు, అట్టివిషయములపట్టికను వారిసి అందరికిని వెల్లడియగు స్థలము నందు ఉంచినచో, ఆపత్రికలను అనేకులు పఠించు నవకాశములు అమితముగ పెరుగున గదా. అట్లుకాదని, ముప్పాతిక భాగము పత్రికలు తెరవబడకనేయుండి, అవి పెరిగిన కొలదిని బీరువాలకు భారమై మురిగిపోవుచున్నవి. నూతనముగ బయలుదేరు గ్రంథములగతియు నిదియేను. గ్రంథ భాండాగారిగాని, అతని సహకారులు గాని, గ్రంథాలయమందలి గ్రంథములందుగల విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నింపరు. కొత్తగ్రంథములు గ్రంథాలయమునకు వచ్చిన వెంటనే అందలి సారస్వతసంపద అందరికిని తెలియబరుపనక్కర లేదా !
తెలియబరుపవలసిన దెవరికి? ప్రతివిషయమును కొందరు ముఖ్యపాఠకులకు తెలియబరుపవలెను. అట్టి ముఖ్య పాఠక సంఘములు ప్రతి గ్రంధాలయమునకు అనుబంధముగా ఉండితీరవలెను. అట్టి పాఠక సంఘములే గ్రంథాలయమునకు జీవము. గ్రంథ భాండాగారి సామర్ధ్యము అనేక పాఠక సంఘముల నాకర్షించి, వానిని పరిరక్షించుటయందును, పాఠకునికిని గ్రంథములకును మధ్యస్థు పరిచయము హెచ్చించుట యందును గలదు. అనగా ఆతనిమీద గ్రంథముల భారమేగాక, పాఠ