Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్పడును. కేవలము జనులను పుస్తకములను చూచిపోవుటకు రానిచ్చుట మాత్రము చాలదు. పుస్తకములు చదువుటకు ఆహ్వానము జనులను ఆకర్షించునదిగ నుండవలెను. “తన్నష్టం యన్నదీయతే” ఇవ్వబడనిది వ్యర్ధమైన దానితో సమానము.

"ఇదిగో గ్రంథములజాబితా, రండి పుస్తకముల నేరుకొండి” అని చెప్పుట గ్రంథాలయములయందు పరిపాటి. కాని ఈగ్రంథముల జాబితాలందు - గ్రంథములను పరిచయము చేయుటగాని, చదువరిని ఆహ్వానము చేయుటగాని స్వాగతోత్సాహములుగాని లేవు. తానిచ్చు విందుతో పాఠకుల నాహ్వానించుటకు ఏగ్రంథాలయ మెక్కువ ఆతురతనుజూపునో అదియే ఆతిథ్యపరత్వము కలది. ఇట్టి ఆతిథ్యము మాత్రమే గ్రంథాలయమును పెద్దదానినిగా జేయును గాని, గ్రంథముల సంఖ్య గాదు, పాఠకులు గ్రంథాలయమును పుట్టింతురనునది సంపూర్ణ సత్యముగాదు; గ్రంథాలయము కూడ పాఠకులను సృష్టించును.

గ్రంథ భాండాగారివిధ్యుక్త ధర్మము:

ఈపరమార్ధము దృక్పథమందు నిలుపుకొన్నచో, గ్రంథ భాండాగారి నెర వేర్పవలసిన విధ్యుక్తధర్మ మెంత గొప్పదియో తెలసికొనగలము. గ్రంథములను సేకరించి విషయ విభాగము చేసి, వానిని జాగ్రత్త పెట్టుటతో ఆతనిధర్మము ముగియదు. అనగా పెంచుట, విభాగించుట-వీనివలన మాత్రము అతని ముఖ్యధర్మము నెరవేరలేదు. గ్రంథములనన్నింటిని ఆతడు పరిచయము చేసికొనియుండవలెను. గ్రంథాలయము పెద్దదైనయెడల అందలి గ్రంథముల నన్నింటిని సరిగా నర్థము జేసికొనుట ఆతనికి అశక్యముకాగలదు. అందువలన పెద్ద గ్రంథాలయము ఉగ్రాణము వంటిది. కాబట్టి భోజనశాలవలె దినదినమును ఆహారమును, ఆనందమును సమకూర్చునది చిన్న గ్రంథాలయము మాత్రమేను.

చిన్న గ్రంథాలయము:

చిన్న గ్రంథాలయము ఇట్టిది: అందు ప్రతివిషయమునందును ముఖ్య గ్రంథములు మాత్ర ముండవలెను. ఆగ్రంథములు సంఖ్యారాధ