మనభాషయందలి పదజాలములు రెండు తావులు కానవచ్చును. మొదటిది నిఘంటువు. రెండవది సారస్వతము. ఒక భాషయందు వాడుక లోనుండుపదములు కొద్దిగానుండునప్పటికిని, ఒక పెద్ద నిఘంటువు నందుమాత్రము అభాషయందలి పదజాలము నంతను సేకరించుట ఉపయోగకర మైనది. కాని సారస్వతమునందలి పదజాలము మిక్కిలి తక్కువ, అందున్న పదములు సజీవమైనవి. అందుచేత సారస్వతమునందలి ఒక్క పదమునైనను విడువజాలము. అయినను నిఘంటువునకంటె సారస్వతమునకే ఎక్కువ విలువయని అంగీకరింపకతప్పదు.
ఈసత్యమే గ్రంథాలయములయెడల గూడ అన్వయించును. గ్రంథాలయమందు బహుగ్రంధ సముపార్జనార్ధమయిన భాగము ఉప యోగకరమైనదియే; కాని నిరంతరము అనేకవిధములు ఉపయోగించుటకై ఏర్పడిన రెండవభాగము గ్రంథాలయముయొక్క మహత్వమును నిర్ణయించును. సామాన్యముగా గ్రంథ భాండాగారి తన గ్రంథాలయమందలి గ్రంథములలో ఎక్కువ గ్రంథములు ఉపయోగింపబడునటుల శద్దను దీసికొనక పోవుటయేగాక, ఆవిషయమును తనతలంపునకు గూడ దీసికొనిరాడు. ఏలయన, సంఖ్యా బాహుళ్యమును ప్రదర్శించి, లోకమును ఉక్కిరిబిక్కిరి చేయుట ఎల్లప్పుడును సులభము.
ఉపయోగకరమార్గములు:
ఒక గ్రంథాలయమును సంపూర్ణ ఉపయోగమునకు దేవలెనన్న, అందున్న గ్రంథములనుగూర్చి అందరికి స్పష్టముగా వెల్లడిజేయ వలెను. అట్లు చేయకున్న సామాన్యజనులకు అవి అందుబాటులో నుండవు. గ్రంథాలయము అప్పుడు ఎక్కువ వసతికలిగియు, రాక పోకలకు సౌకర్యములేని నగరమువలె విడిచి పెట్టబడును. ఏదేని ముఖ్యాన్వేషణతో తరుచు గ్రంథాలయమునకు వచ్చుచుండువారు తమఆవశ్యకతయొక్క తొందరనుబట్టి, తమంతట తామే దారిచేసికొందురు. ఈవిషయమునందు తనకుగల బాధ్యతను గ్రంథాలయమే గుర్తింపవలెను. గ్రంథాలయమందు గ్రంథము లున్నందులకు ఫలితముగ వానిని అందరిచేతను చదివింపవలెను. అప్పుడే గ్రంథాలయమునకు సార్థకత