Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అఖిలభారత గ్రంథాలయ మహాసభ

ఆహ్వాన సంఘాధ్యక్షులగు రవీంద్రనాథ ఠాకూరు గారి యుపన్యాసము :

సేకరించుటయందుపే రాస:

అత్యాశ మానవుని ముఖ్యమగు అంతశ్శత్రువులలో నొకటి. అతడు ఒకసారి, సేకరించి నిలువజేయుటకు ప్రారంభించుచో- సంఖ్యను హెచ్చించు తలంపున కూడబెట్టుట యందుగల పరమార్గమును మరచి పోవును. అతడు తనధనాగారమునకు ధనము పోవు జేయుచున్నను, తన తెగను విస్తరింప జేయుటకుగాను మనుష్యులను కూడదీయుచున్నను - ప్రోగుజేయవలయుననెడి యుత్సాహ ప్రవాహమునబడి కొట్టుకొని ప్రోగుజేయవలయుననెడి పోవును. అప్పటి గ్రుడ్డితొందరలో అతని ఆశయమగు నవధి కళంకిత మగును. ఏ సత్యముయొక్క విలువను గాని అందున్న వస్తువుల సంఖ్యా బాహుళ్యము చేత నిర్ణయింప రాదని ఆతనిమనస్సు మరచిపోవును.

సంఖ్యా బాహుళ్యము:

విశేషగ్రంథాలయములను పోగు చేయుతృష్ణ పీడించుచున్నది. ఆ గ్రంథాలయములలో ముప్పాతిక వంతు పుస్తకములను ఎవ్వరును ఉపయోగింపరు. అనుపయోగ గ్రంథములు అమితముగా పెరిగిపోవుట వలన, ఉపయోగార్థము ఉద్దేశింపబడిన కొద్ది మంచిగ్రంథములు గూడ మూలబడిపోవుచున్నవి. జనసామాన్యముయొక్క వాడుకలో ధనవంతుని గొప్పవాడందురు. ఒక కోటీశ్వరుడు ఏదేని సమావేశము నకు వచ్చెనని ఒకరినించి మరియొక రాతనిని గౌరవించుటకై పోటీపడుదురు. ఆగౌరవము, అతడు ఒసంగవలసిన దానిపైనగాక కేవల మతని కున్న దాని పైన నిలుచును. ఈవిధమున చాలావరకు గ్రంథాలయముల గొప్పదనము గ్రంథముల సంఖ్యవలననే నిర్ణయింప బడుచున్నది. ఒగ గ్రంథాలయమందలి పుస్తకములు ఉపయోగించుటకు గల సౌలభ్యములే అగ్రంథాలయమునకు వశిష్ఠను గూర్పవలసియుండ, అట్టి సౌలభ్యములు అవసరములని గ్రంథాలయములచే పరి గణింపబడకున్నవి.