Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు పత్రికలన్నియు శ్రీ సంజీవ రాయణంగా రే తెప్పించి ఇచ్చుచున్నారు.

౼ సూ.నరసింహనాయుడు, కార్యదర్శి.


శ్రీ శారదా పుస్తక భాండాగారము - నాగిరెడ్డిపల్లె

కదిరి తాలూకా నాగి రెడ్డిపల్లె శ్రీ శారదా పుస్తకభాండాగారపు అధ్యక్షులు మాచిరెడ్డి వెంకటస్వామి రెడ్డిగారిచే ఆంజనేయ భజనసంఘ మొకటి స్థాపింపబడినది. ఈ భజనసంఘములో సుమారు 80 మందివరకు సభ్యులు చేరినారు. ఈ భజనసంఘమువారు ప్రతి దినము భజన చేయుచున్నారు. డిశంబరు నెల 23, 24 తేదుల యందు ఆంజ నేయజయంత్యుత్సవము జరుపబడినది. గ్రామ శాంతి నిమిత్తము గడిచిన నెల 23 న తేది రాత్రి శ్రీయుత పి. కృష్ణా రెడ్డిగారి వలన సీతాకళ్యాణము, రుక్మాంగద చరిత్రములు, తెల్లవారి 6 గంటల వరకు ఆంజనేయాలయమువద్ద హరికథా కాలక్షేపము జరుపబడినది. గ్రామశాంతి నిమిత్తము సుమారు 4000 మందికి అన్న దానము గావింపబడెను. అనేకమంది చుట్టుపట్ల గ్రామవాసులు వచ్చి చూచి ఆనందించిరి.

19-1-29 తేదిన శ్రీ వేమనజయంత్యుత్సవము మిక్కిలి జయప్రదముగ జరుపబడినది. సాయింత్రం 3 గంటలకు వేమనపటమును భజనతో ఊరేగింపు జరుపబడినది. 5 గంటలకు గ్రంథాలయమువద్ద మాచిరెడ్డి వెంకటస్వామి రెడ్డిగారి అధ్యక్ష శక్రింద గొప్ప సభ జరిగినది. దై వప్రార్థన జరిగినతరువాత అధ్యక్షులు వేమన జీవితము, కవిత్వము, వేదాంతము - వారిపద్యములు విమర్శగాను వినువారికి ఉత్సాహకరముగాను వుండునట్లు ఉపన్యసించినారు. ఆరాత్రి 8 గంటలకు శ్రీపించ సార్ద నాగప్పగారి వలన ప్రహ్లాద చరిత్ర హరికథా కాలక్షేపము జరిపించినారు. సభ్యులకు గంధపుష్వ తాంబూలములతో సత్కరింపబడినది. జయంతి చాలా జయప్రదముగా జరుపబడినది.

— సాదు గెంగిన్న, భజనసంఘ కార్యదర్శి