Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ స్వరాజ్య లక్ష్మీ పుస్తక భాండాగారము

బెజవాడ

ఈ గ్రంథాలయము ప్రప్రథమమున అయ్యంకి వేంకటరమణయ్యపంతులవారి గృహమున కొందరు బాలురచే 1924 సంవత్సరమున స్థాపింపబడినది. మొదట షుమారు నూరు చిన్ని పొత్తములతో స్ధాపింపబడి క్రమముగా పలువురి ప్రోత్సాహముచేత ఒక సంవత్సరమునకు షుమా రైదువందల గ్రంధ రాజములతో విరాజిల్లి రక్తాక్షి నామసంవత్సరమున వార్షికోత్సవము గావింపబడి ప్రఖ్యాతిగాంచినది. నేటికి షుమారు వేయిపొత్తములతోను ఆంధ్ర కృష్ణా ఆరోగ్యప్రకాశీ కాది పత్రికా రాజములతోను నిండియున్నది. ఇటీవల భాండాగారాభివృద్ధి నిమిత్తము శ్రీయుత పువ్వాడ శేషగిరి రావుగారి యాధిపత్యమున నొక సభగావింపబడి, పఠనాది సౌకర్యార్ధము బెజవాడ హిందూ హైస్కూలునకు సమీపమున నొకగృహమందు ప్రవేశ పెట్టబడి యున్నది. ప్రస్తుతము కొలదిమంది చందాదారులుమాత్రమే గలరు. కాన మహనీయులందరును భాండాగారము నభివృద్ధిపరుప బ్రార్ధన.


——గుండేపూడి రామకృష్ణశర్మ

సహాయ కార్యదర్శి





శ్రీలజపతిరాయి విద్యానిలయము

తుమ్మపూడి

ఈ విద్యానిలయమునకు డాక్టరు సూర్యదేవర సంజీవరాయణం యం.డి.అండ్ హెచ్.యస్ గారు అధ్యక్షులు. వీరిచే స్థాపింపబడిన శ్రీ సీతారామ భక్త సంఘమునకు ఒక శాఖగా ఏర్పరచబడినది. ఇందు షుమారు 400 గ్రంథములు గలవు. 30 పత్రికలు వచ్చుచున్నవి. యువకులు ప్రతినిత్యము పగలును రాత్రియందును గూడ వచ్చి పత్రికలు, పుస్తకములు చదువుచుందురు. ఆంధ్రపత్రిక గాక మిగతా పొత్త