Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వత్సరము క్రిందట అప్పటి కసంపూర్తిగా నున్న యీ భవనమును పూర్తి చేయించుటకు మొదలు పెట్టి షుమారు రు 50,000 ల వరకు వెచ్చించి యీ దివ్యమైన గ్రంథాలయమును కట్టించి యిచ్చిరి. ఈ భవనము 750 చతురపు గజముల వైశాల్యము కలిగి అంతయు రాతిచే కట్టబడి బరోడా రాజ్యమందలి గ్రంథాలయముల నమోనాననుసరించి యున్నది. ఇందు 90 చతురపు గజముల వైశాల్యము గల పఠనమందిరము గలదు. దీని ననుసరించియే దీని పై భాగమున పుస్తక భాండాగారమున్నూ కలదు. వీటికి వెనుకనున్న 590 చతురవు గజముల వైశాల్యముగల ఉపన్యాసమందిరము 800 మంది సభ్యులు కూర్చొనుటకు తగినట్టుగను, సినీమా, నాటక ప్రదర్శనములు కుపయుక్తమైనదిగను నున్నది. ఈ మందిరమున కిరుపక్కలను స్త్రీలకు కూర్చొనుటకు ప్రత్యేకముగ గ్యాలరీ లమర్చబడినవి.




పరబ్రహాంధ్ర భాషా నిలయము, భువనగిరి

నిజాంరాష్ట్రం నల్లగొండజిల్లాలో చేరిన భువనగిరియందు 1924 సంవత్సరమున యీరాజ్య ఆంధ్ర గ్రంథాల యోధ్యమ స్థాపకులనబడు శ్రీ మాడపాటి హనుమంతరావుగారి ప్రోత్సాహమున ఈ గ్రంథాలయము స్థాపింపబడి సుమారు మూడు సం లు నడుపబడి కొన్ని కారణములవల్ల శ్రద్ధతగ్గి ౨౬౦ పుస్తకములు, రు ౨౭ లు నిలువ, మరియు కుర్చి మేజు బెంచీలతో నిలచియుండి - అభిమానధనులగు శ్రీ తాడేపల్లి మృత్యుంజయరావు పంతులుగారి యాదరణలో పునరుద్ధరింపబడి వీరి యాధిపత్యముననే 5 ఫిబ్రవరి 1929 తేదిన సభ గావింపబడి నూతన కార్యనిర్వాహక వర్గముయొక్క ఎన్నికలు జరిగినవి. కార్యక్రమ నిబంధనలు జరిగిన తర్వాత యీ గ్రామ పటేలుగారగు యెడ్ల వెంకటాద్రిగారు తమ యింటిని గ్రంథాలయము నిమిత్తము దానపూర్వకముగా నిచ్చి తమ ఆంధ్రభాషా పోషణత్వమును వెల్లడించి శాశ్వతకీర్తిని జూర గొనిరి.


— టి. ధర్మయ్యాచార్యులు