నమునకు యిచ్చెదమనిరి. అందుమీద ఈ సంఘము వారు గ్రంథాలయమునకే గాక ఉపన్యాసము లిచ్చుటకున్నూ, అప్పుడప్పుడు నాటక ప్రదర్శనములకు కూడ ఉపయుక్తముగ నుండుటకును తగిన భవన నిర్మాణమునకై ప్రయత్నించిరి. పురపాలక సంఘము 2000 చతురవు గజముల - ఇప్పుడు భవన నిర్మాణము గావించిన యీ స్థలమును సం॥రము 1 కి గు 100 లు అద్దెయిచ్చు పద్ధతిని, గవర్న మెంటు వారిచే విధించబడు నేలపన్ను యిచ్చు పద్ధతిని, 80 వత్సరముల కొకతూరి పన్నును మరల మార్పు పద్ధతిని, శాశ్వతకవులుకు యిచ్చిరి. 1919 వ సంవత్సరములో యీ స్తలము యీ సంఘమువారికి వప్పచెప్పిరి. శ్రీ గంగరాజుగారు 26-11-20 తేదీని భవననిర్మాణమునకై ప్రారంభించిరి. అప్పటినుండియు యీ భవన నిర్మాణము పూర్తి యగుటకు 8 సంవత్సరములు పట్టినది. ఇంత ఆలస్యమునకు కారణ మేమన యీ సంఘమునకు వ్రాసిన కవులునందు పురపాలక సంఘమువారికి సం॥ 1 కి యిచ్చురు 100 లే గాక గవర్నమెంటువారిచే విధించబడు నేల పన్ను కూడా యిచ్చు పద్ధతియే. దీని ననుసరించియే 1922 సంవత్సరమున రివిన్యూ బోర్డువారు యీ సంఘమునకు సంవత్సరము 1 కి రు 400 లు పన్ను విధించిరి. ఈ హెచ్చుపన్ను విధించుటచే 5 సంవత్సరములవరకును భవన అసంపూర్తికిని, అనవసరముగ బోర్డు వారికిని, సంఘమువారికిని, పుర పాలక సంఘము వారికిని ఉత్తర ప్రత్యుత్తరములకును తుట్టతుదకు పురపాలక సంఘము వారికిని యీ యువజన సంఘము వారికిని దావాలకుకూడా కారణమైనది. తుదకు గవర్నమెంటు వారు పట్టణస్థలనులమీద నేలపన్ను విధించు ముఖ్యసూత్రమును శాశ్వతమైన పునర్విమర్శన చేసి ఈ సంఘము చెల్లించ వలసిన పన్నును రు 2-9-0 లకు తగ్గించిరి. ఈ హంశము యీ ప్ర్రాంతమందలి దేశమందంతటను ప్రతివాని హృదయము నాకర్షించినప్పటికిని తుట్టతుదకు తేలిన ప్రభుత్వమువారి నిశ్చితాభిప్రాయము అనేక భవనములను కట్టించు దాతల హృదయములను సంతోషదాయకములుగ జేసినది. ప్రభుత్వమువారు ఈ విధముగా పన్నును తగ్గించినారనిన శుభ వార్త తెలిసినతోడనే యీ భవనదాతలగు శ్రీ గంగరాజుగారు సం
పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/14
స్వరూపం