హిందూయువజన సంఘము - ఏలూరు
ఈగ్రంథాలయముయొక్క నూతన భవన ప్రవేశమహెూత్సవము 10-2-29 తేదీన మహావైభవముగా జరిగినది. నాడు ప్రాతఃకాలమున మార్టోరీ బ్యాంక్సు దొరగారు నూతన భవనమును దెరచి, తదుపరి నూనెరంగులతో వ్రాయబడిన శ్రీ శ్రీ మోతే గంగరాజు జమీందారు గారి పెద్దపటమును బహిర్గతము జేసిరి. మధ్యాహ్నము శ్రీ సూరి వేంకటనరసింహశాస్త్రి గారి అధ్యక్షత కింద గొప్ప సభ సమావేశమయ్యెను. శ్రీ దాసు త్రివిక్రమరావుగారు వివిధ దేశములందలి ప్రాచీన నవీన గ్రఁథాలయోద్యమములను గూర్చి విపులముగా జెప్పిరి. అధ్యక్షలు ఆంధ్ర దేశమందలి గ్రంథాలయములను గూర్చియు, గ్రంథాలయములను ఉపయోగకరముగ చేయదగు మార్గములను గూర్చియు వివులముగా జెప్పిరి.
ఈసంఘాధ్యక్షులగు శ్రీ మోచర్ల రామచంద్ర రావు పంతులు గారి పినతి పత్రమునుండి ఈక్రింది విషయములను ముద్రించు చున్నారము.
ఈ సంఘము 1904 సంవత్సరములో కొంతమంది యువకులచే సంఘసేవ, దైవభక్తి మొదలగు ఆదర్శములతో స్థాపింపబడెను. 1914 వ సం॥ రములో దీని కుపకరణముగా ఒక గ్రంథాలయమును, పఠనమందిరమును పురజనులు కుపయుక్తముగా నుండునటుల చేర్చబడెను. 1915 వ సంవత్సరమునుంచియు యీ సంఘము ధర్మకార్యములయందును, సాంఘిక విద్యావిషయములయందును పాల్గొనుచున్నది.
ఇప్పటికీ గ్రంథాలయమున 8000 గ్రంథములు గలవు. స్త్రీలు కూడ చాలమంది యీ గ్రంథాలయము నుపయోగించుచున్నారు. అరువది పత్రికలు వచ్చుచున్నవి. కొంతకాలమునుంచి యీ సంఘమునకు తగిన భవనమును ఆర్జించు ప్రయత్నములు జరుగుచుండెను. అందుబిూదట ఉదారస్వభావులును, ధార్మికులును, అనేక ధర్మకార్యములు చేసిన వారును, జమీందారులును అగు శ్రీమోతే గంగరాజు గారిని అర్థింపగా 15 వేల రూప్యముల విరాళమును యీ సంఘ భవ