Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. కాన మిట్టిగాన మిఁక జ ♦ శీగానఁ గాన
    “అభినవ త్యాగరా” జను ♦ నట్టి బిరుద
    మితని కేఁ జెల్లు నని ప్రజ ♦ లెల్ల నొగడఁ
    బలె నే ఘనుఁ డతని నేఁ ♦ బ్రస్తుతింతు.


సీ. తనజీవితము రామ ♦ ధరణీశుసేవకై
   ధారవోసిన మహా ♦ ధార్మికుండు
   తనవాళ్చమత్కృతి ♦ జనముల నలరింప
   దీక్షఁ గైకొనిన యు ♦ దీర్ణగుణుఁడు
   తనశక్తి భారతావని ♦ నెల్ల దిక్కుల
   వ్యాపింపఁ జేసిన ♦ పధిత చణుఁడు
   తనయార్జితధనమ్ము ♦ ననయమ్ము బిద సా
   దల కొసంగిన యశో ♦ ధన విభుండు


తే. అట్టి శ్రీకరుఁ డాంధ్రర ♦ త్నాభిధానుఁ
    డైన గోపాలకృష్ణయా ♦ ఖ్యానువర్తి
    తమగు గ్రంథాలయమును సం ♦ తతము బ్రోచు
    గాత గోపాలకృష్ణుండు ♦ కరుణతోడ.


శా. కారాగారనివాసకాలమున లో ♦ కఖ్యాతుని రాము నెం
   తే రమ్యంబుగఁ బ్రస్తుతించుటను గా ♦ దే? "రామదాసుం" డన౯
   బేర౯ బిల్వ బఱంగా, నట్టి యనఘ౯ ♦ విద్యాధికు౯ గృష్ణు స
   త్పేర౯ స్థాపిత పుస్తకాలయమి దె ♦ వ్వేళ౯ జయంబొందెడి౯


మ. కలుగుం గావుత సౌఖ్యమాతనికి స్వ ♦ ర్గంబందుఁ, దత్చేరున౯
    లలి గ్రంథాలయ మొండు నిల్పిన జన ♦ వాతంబు నెంతేఁ గృపా
    కలనఁ గృష్ణుఁడుఁ బ్రోచుగాత, మఱి త ♦ ద్గ్రంథాలయం బెప్పుడు
    బలు పొ త్తంబుల చేతఁ బతికలచే ♦ భాసిల్లి వర్థిల్లుత౯