Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.8 (1929).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రము నిలయాధ్యక్షులు సభాసదులకు స్వాగత మొసఁగిరి. సభాధ్యక్షులు పుష్పమాలాలంకృతులు గావింపబడిన పిమ్మట స్వాగత పద్యములు చదువబడెను, సభాధ్యక్షులు ప్రారంభోపన్యాస మొనరించిరి, ప్రముఖులు పంపిన సందేశములు, ఆశీర్వాద పద్యములు చదువబడెను. పిమ్మట కార్యదర్శి ప్రధవ సం॥ర నివేదికను చదివెను. శ్రీవరహగిరి వెంకటభగీరథిగారంపిన భావకుసుమావళి యను వ్యాసము చదువబడెను. ఆంధ్రజన సంఘ కార్యదర్శి కొ.వెం.రా.ల.నా. శర్మగారు, “పాల్వంచ సంస్థాన పూర్వప్రశస్తి - టిస్థితిగతులు - సంఘసంచలనము”ను గురించి తమ యుపన్యాసము నుడివిరి. రెండవదినమున సభాప్రారంభమున నిలయోపాధ్యక్షులు శ్రీ సుబ్బారావుగారు తాము రచించిన యాశీర్వాద పద్యములు చదివిరి. సభాధ్యక్షులు తమ అధ్యక్షాన్యాసము నొసంగిరి. పిమ్మట బ్రహ్మశ్రీ పండిత పట్టాభిరామశాస్త్రి గారు 'ఆంధ్ర భాషాస్థితి గతులు' అను విషయమునుగురించి యుపన్యసించిరి. పిమ్మట శతావధాని దోమా వేంకటస్వామిగుప్త గారంపిన 'తెనుగుంగూర్చి విన్నపము' అను పద్యవ్యాసము చదువబడెను. సభాధ్యక్షులు కొంత విమర్శనలతో భవన నిర్మాణమును, గ్రంథోపయోగమును గూర్చి హెచ్చరించుచు అంత్యోపన్యాస మొసంగిరి. సభాంతమున రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ మామిడి బుచ్చయ్యగారు రు. 116 లు, నిలయ ప్రధాన పోషకులు శ్రీ పలివెల సింగయ్యగారు రు. 116 లు భవననిర్మాణమునకు విరాళము లొసంగి ప్రోత్సహించిరి. స్థానిక ప్రముఖులు రు. 200 ల వరకు వాగ్దానము లొనరించిరి.


గోపాలకృష్ణ గ్రంథాలయము - పొందూరు

తే. ప్రఢత శ్రీ దుగ్గిరాలాన్వ ♦ వాయభవుఁడు
    "ఆంధ్ర రత్నము” నా బిరు ♦ దాంకితుండు
    కీర్తి శేషుఁడు, గోపాల ♦ కృష్ణయాఖ్యుఁ
    డనఘుఁ డాతని స్మరియింతు ♦ నాత్మలోన