Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముల యొక్కయు డైరక్టరీ నొక దానిని తయారు జేయుటకు ఈ సభ వారు తీర్మానించు చున్నారు.

23 "పధేర్ దేబ్ ” “భారతిగీతములు" అను గ్రంథములను నిషేధింపుచు చేసిన తీర్మానములను రద్దు చేయవలసినదని ఈ సభ వారు కోరుచున్నారు.

24 గ్రంథాలయపరిపాలనా సౌకర్యార్థమై ప్రతిరాజధాని యందును ఆరాజధాని భాషయం దొక గ్రంథాలయ పత్రికను ప్రకటించుట అవసరమని ఈసభవారు తీర్మానించుచున్నారు.

25 చిన్న గ్రంథాలయములు తమవద్దలేని గ్రంథములను ఎరువు తీసికొనుటకుగాను మండల, రాజధాని కేంద్ర గ్రంథాలయములను ఏర్పరచుట అవసరమని ఈసభవారు తీర్మానించుచున్నారు.

26 యువకులచే నడపబడుచు గ్రంథాలయములను జొచ్చి ప్రభుత్వమువారిచే నిషేధింపబడని గ్రంథములనుగూడ పోలీసువారు తీసికొని పోవుచుండుటను ఈసభవారు తీవ్రముగ గర్హించుచున్నారు.

27 కీర్తిశేషులకు బంకించంద్ర చటర్జీ యొక్క గృహమును విక్రయమునకు తీసికొని దానిని సంరక్షించుటకు పూనుకొనిన బంకిం సాహిత్యస మ్మేళనము వారికి ఈసభవారు వందనము లర్పించుచున్నారు.

28 లండను నందున్న బ్రిటిషు మ్యూజియంవలె భారతవర్షమునకు జాతీయ గ్రంథాలయముగ నున్న కలకత్తా ఇంపీరియల్ గ్రంథాలయమునందు హిందూదేశమందు ప్రకటింపబడుచున్న గ్రంథముల యొక్కయు, పత్రికలయొక్కయు ఒక్కొక్క ప్రతిని ఉంచవలెనని ఈ సభవారు ప్రభుత్వమువారిని కోరుచున్నారు.

29 వ్యక్తులయొక్క గ్రంథాలయములనుగూర్చి విచారించి అవి శిధిలముగాకుండ నుంచుటకై ఈసభవారు గ్రంథాలయ సంఘము లను కోరుచున్నారు.