ఫీజును మాపు జేయవలసినదని ఈసభవారు కేంద్ర శాసన నిర్మాణ సభవారిని కోరుచున్నారు.
16 ప్రభుత్వమువారు 1867 సంవత్సరమందు చేసిన చట్టప్రకారము ప్రతి రాష్ట్ర మందును వసూలు చేయుచున్న గ్రంథముల నన్నింటిని, తగిన కట్టుదిట్టములతో ప్రజలను చదువుకొన నియ్యవలసినదని ఈ సభవారు కోరుచున్నారు.
17 "లీగు ఆఫ్ నేషన్సు” యొక్క “ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ నేషనల్ కో ఆపరేష౯న్" వారియొక్క పనికి తోడ్పకుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు.
18 జాతీయ వాఙ్మయమును గొప్ప దేశభక్తుల జీవిత చరిత్రలను వ్యాప్తము చేయవలసినదని గ్రంథాలయము లన్నింటిని ఈ సభ వారు కోరుచున్నారు.
19 గ్రామ గ్రంథాలయముల ఉపయోగమునకై ఆకర్షణ వంతములగు కరపత్రములను నూతన గ్రంథముల నుండి ఏర్చిన పట్టికలను ప్రకటింప వలసినదని అఖిల భారత గ్రంథాలయ సంఘము వారిని ఈ సభవారు కోరుచున్నారు.
20 సంస్కృత గ్రంథముల వర్గీకరణ విషయమునను, భారత శాస్త్రముల వర్గీకరణ విషయమునను “ఎటావా” యందున్న శ్రీ విద్యాపీఠము వారు చేయుచున్న గొప్ప కార్యమును ఈ సభవారు అభినందించుచు, భారత విజ్ఞానాభివృద్ధికి పునాదియగు ఈ కార్యమునకు గ్రంథాలయము లన్నియు తోడ్పడవలెనని ఈ సభవారు కోరుచున్నారు.
21 పరిశోధనా కార్యములకు తోడ్పాటుగా నుండుటకుగాను దేశమందలి గ్రంథాలయము లన్నియు గ్రంథములను పరస్పరము ఎరువిచ్చుకొనుటను ప్రోత్సహించవలెనని, ఈ సభవారు కోరుచున్నారు.
22 రాబోవు సభ జరుగులోవున భారతవర్ష మందుగల గ్రంథాలయము లన్నింటి యొక్కయు విశ్వ విద్యాలయ గ్రంథాలయ