ముగా నియ్యవలెనని ఈసభవారు రాష్ట్రీయ ప్రభుత్వము వారిని కేంద్ర ప్రభుత్వమువారిని కోరుచున్నారు.
11 గ్రంథాలయ పరిపాలనయందు తరిబీతు నిచ్చుటకుగాను, ఒక పరీక్షను యేర్పరచుట అగత్యముగనుక, గ్రంథ భాండాగారి పదవిని తగుసమర్థతతో నిర్వహించుటకు తగిన తరిబీతును పొందిన యువకులు లభించుటకై, ఆపరీక్షకు కావలసిన ప్రణాళికను తయారు జేయవలసినదని వివిధ విశ్వవిద్యాలయముల నీసభవారు ప్రార్థించుచున్నారు.
12 ధర్మ గ్రంథాలయములను స్థాపించుటయందును స్థాపింపబడినవానికి సహాయము జేయుటయందును దేశమందు వివిధపుర పాలక సంఘములును స్థానిక సంస్థలును చేసినపనిని ఈసభవారు సంతృప్తితో గుర్తించి అట్టివారు ఇతరులకు మార్గదర్శకు లైనందులకు వారి నభినందించుచున్నారు; మరియు ఏగ్రంథాలయమైన ఖర్చునందు మూడింట నొకవంతు సొమ్మును సంపాదించుకొనునెడల, మిగిలిన రెండువంతులలో ఒకవంతు స్థానిక సంఘములు గాని పురపాలక సంఘములుగాని భరించులాగునను, ఇంకొక వంతును స్థానిక ప్రభుత్వమువారు భరించులాగునను స్థానిక చట్ట నిర్మాణసభవారు, తగిన చట్టములను జేయవలయునని ఈసభవారు కోరుచున్నారు.
13 దేశభాషలందు విద్యగరపు పద్ధతిని ధర్మగ్రంథాలయోద్యమము వ్యాప్తము జేయవలయుననియు, ఆకార్యసిద్ధికై రాష్ట్ర గ్రంథాలయ సంఘములు దేశభాషలయందు గ్రంథములను వ్రాయుటకు ప్రోత్సహించవలెననియు, లిఖితగ్రంథములను సేకరించి, సంరక్షింప వలెననియు ఈసభవారు కోరుచున్నారు.
14 కలకత్తా ఇంపీరియల్ లైబ్రరీ గ్రంథ భాండాగారిపదవి ఖాళీయగుచున్నందున, ఆపదవికి హిందూదేశజుఁడై పరిపాలనా సమర్హత గలిగిన గొప్ప విద్వాంసుని ఏర్పరుపవలెనని ఈసభవారు కోరుచున్నారు.
15 ధర్మగ్రంథాలయములు 1860 సంవత్సరపు 21 నెంబరు అక్టుక్రింద రిజస్టరీ చేసికొనుటకు ఇయ్యవలసిన రు 50 ల రిజిస్ట్రేషను