Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాళముగ అనుగ్రహించిరి. వేటపాలెం యూనియన్ బోర్డు వారు రు 50 ల విరాళమును మంజూరు జేసిరి. బహుమ

ప్రతి వత్సరమును బ్యాడ్మిటక్ పోటీ యాటయు, చెడుగుడు పోటీయాటయు వార్షికోత్సవ సమయమునందు ఆడుబడుచున్నవి. వీరికి రజత పతకములును, సదా తిరుగుచుండెడి రజత పాత్రలున్నూ బహుమతి ఇయ్యబడుచున్నవి. ఆంధ్రవ్యాసరచన పోటీపరీక్షలలో పొందిన వారికి సువర్ణపతక మొకటియు, రజతపతకములు రెండును ఇయ్యబడినవి.

ఈని కేతనమునకు ఒక గ్రంథ భాండాగారియును, ఒక సేవకుఁడును గలరు.

ఈనిలయమునకు రు 7,384 లు మూలధనముగలదు. ఈవత్సరము రు 2254–8–11 లు ఆదాయము గలదు. అదియంతయు వ్యయమైనది. ఆదాయములో ధర్మకర్తగారి పెట్టుబడి రు 1203–2-5 లు వివాహాది శుభకార్యములందును, పర్వదినములందును రు 481-15–0 లు వసూ లయ్యెను. ఒక దాత బీరువాకు కావలసిన సొమ్ము నిచ్చిరి.

419 గ్రంథములు దాతలచే నొసంగబడినవి. మఱికొంతమంది గ్రంథములను తగ్గింపు ధరలకు ఇచ్చియుండిరి. 12 గ్రంథ మండలులకు చందాదారుగా చేరియున్నది. 29 పత్రికలు వచ్చుచున్నవి. కొందరు దాతలు 4 బీరువాలను ఒక మడత డ్రాయరును, ఒక పెట్టెను, ఒక లస్టర్ కొని యిచ్చిరి. ఈ వత్సరమున 12 ఉపన్యాసములును, ఒక నగర సంకీర్తనమును, ఒక హరికథాకాలక్షేపమును, పురాణ కాలక్షేపమును నూతన పంచాంగ శ్రవణమును జరిగెను.

ఈగ్రంథాలయమునకు రు 15,706-9-6 లు విలువ గల ఆస్తి గలదు.