ఆంధ్రప్రబోధినీ గ్రంథాలయము, రాశీపురము
సేలంజిల్లా
ఆంధేతరమండల మనదగు ద్రావిడ దేశములో నాంధ్రసోదరులు అనేకులు శతాబ్దముల కొలది స్థిరనివాసము గైకొనియుండు విషయమును, వారలు ఆంధ్రమును ఇండ్లలో మాట్లాడుకొనుట మాత్రమే కాని ఆంధ్ర భాషాపఠన పరిచయమును, మీదుమిక్కిలి ఆంధ్రత్వమునుగూడ గోల్పోవుచుండు విషయమును అంద ఱెరింగినదియ.
ఇటీవల యాంధ్రమండలమునం దుద్భవించిన ఆంధ్రోద్యమతత్వము దేశమందెల్లెడలను బ్రాకి ఆంధేతరమండలములలో నుండు ఆంధ్రులకు సైతము మాతృభాషాభిమానమును, ఆంధ్రసోదరత్వాభిమానమును బురికొలుప తలపడియున్నది. ఈ సమయమున గ్రంథాలయోద్యమనాయకులగు శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్య పంతులుగారిని ప్రశంసింపవలసియున్నది. శ్రీపంతులుగారు చేయుచుండిన మహత్కార్యముల నప్పుడప్పుడు మేము గమనించుచుంటిమి. బహుశా యీ ఆంధ్రప్రబోధినీ గ్రంథాలయ మేర్పడుటకును శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య పంతులుగారే ముఖ్యకారణమని చెప్పవచ్చును. మఱియు ద్రావిడ దేశాంతర్గత మండలములలోని ఆంధ్రసోదరులు కొందఱు ఇటీవల ఆంధ్రోద్యమతత్వము నెరింగి ఏత దుద్యమమునకు సహాయు లగుచుండుటయు ప్రత్యక్షము. అయినను వేలకొలఁది యాంధ్రులు ద్రావిడ దేశమునందు తమ ఆంధ్రవ్యక్తిత్వము నెరుంగక నివసించుచున్నారు. అట్టివారల కందఱికిని మాతృభాషాభిమానమును కలిగించి ఆంధ్రులతో సంఘీభావ మూనునట్లు చేయుట కెంతో ప్రచారమవసరముగ నున్నది. ఇట్టి విషయములు గమనించి ఈపురమునందు ఆంధ్రప్రబోధినీ గ్రంథాలయము యేర్పరుపబడియున్నది.
ఆంధ్రములో నుపన్యాసము లిప్పించియు, కరపత్రములఁ బ్రకటించియు నీమండలమునందలి యాంధ్రసోదరుల కందరికిని మాతృ