Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఆంధ్ర), డి. డబ్లియు జోసి (మహారాష్ట్ర), డాక్టరు గురుదాసురాయి (బెంగాలు), ఏ. యస్ . ముద్దుకృష్ణ (పుదుక్కోట), సూర్యప్రసాద మహాజక్ (బీహారు), ఎ, శివరామమీన (మద్రాసు), హెచ్చి.ఎస్. పమనాని (సింధు), వై. వి. చంద్ర శేఖర అయ్యరు (మైసూరు). యం. ఎన్. అమీను (బరోడా), యూసఫుద్దీన్ అహమ్మదు (హైదరాబాదు), లాలాహార్ దయాల్ ఖన్నా (లాహెూరు), గార్లు సహాయకార్యదర్శులుగాను ఎన్నుకోబడిరి.

గ్రంథాలయసభ 9వ తీర్మానము నందు ఉదహరింపబడిన ప్రకారము గ్రంథ వర్గీకరణమును గురించి యోజించి సలహాల నిచ్చుట కొక సంఘము ఏర్పరుపబడెను.




గోపాలకృష్ణ గ్రంథాలయము, పొందూరు

ఈ గ్రంథాలయము తే 17-8-28 దిని 600 గ్రంథములతో స్థాపింపఁబడినది. ఇందు నలువదిమంది సభ్యులు గలరు. ప్రతిమాసమున రు 10-0-0 లు చందాలవల్ల వచ్చుచున్నది. ఇప్పటికి 1300 గ్రంథములచే యీ పుస్తక భాండాగారము విరాజిల్లుచున్నది. 8 పత్రికలు వచ్చుచున్నవి. ప్రతిదినము రాత్రులందు 8 గంటలు మొదలు 10 గంటలవరకు, శ్రీమహాభారత సత్కథాకాలక్షేపము గావింపబడు చున్నది. తే 17-12-28 దిని శ్రీ ధర్మరాజు పట్టాభిషేక మహెూత్సవము జయప్రదముగాఁ జరుపఁబడెను. ఆనాడు శ్రీ జయంతి కామేశం పంతులు గారు తమ గృహమందు 200 మంది బ్రాహ్మణులకు తృప్తికరముగా సంతర్పణము గావించిరి. నాటి రాత్రి మయూరధ్వజ చరిత్రము హరి కథాకాలక్షేపము జేయఁబడినది.


౼ పేరేపు అన్నాజీరావు

సహాయ కార్యదర్శి