Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొక గొప్ప సావకాశము. దేశమందు విద్యాభివృద్ధికి గాను తోడ్పడు చుండుట చేత గ్రంథాల యోద్యమమునకు సహాయము చేయుట అందరికిని విధియై యున్నది!

ఈ ప్రదర్శనమునందు బరోడా రాజ్యము నుండియు, ఆంధ్రదేశము నుండియు వచ్చిన అనేక పటములు, గ్రంథములు, పత్రికలు ప్రదర్శింపబడినవి. మరియు అడయారు గ్రంథాలయము, గయా గ్రంథాలయము, దర్భాంగా గ్రంథాలయము, మైసూరు గ్రంథాలయ సంఘము, హుగ్లీ గ్రంథాలయ సంఘము, మాక్మిల్లను కంపెనీ మున్నగు వారిచే అనేక ప్రదర్శనవస్తువులు ప్రదర్శింపబడినవి. ప్రతిదినమును ప్రేక్షకులు వేలకు వేలువచ్చి ప్రదర్శనమును జూచి భారతవర్షమున వివిధ రాష్ట్రములందు గ్రంథాలయోద్యమమునకు జరుగుచున్న పనిని తెలిసికొని యానందించిరి.




అఖిలభారత గ్రంథాలయ సంఘము

కలకత్తాయందు అఖిలభారత గ్రంథాలయ సభ ముగిసిన పిమ్మట, ఈసంఘముయొక్క వార్షిక సమావేశము జరిగెను. సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారు అధ్యక్షులుగాను, సూరి వెంకటనరసింహ శాస్త్రి గారు ఉపాధ్యక్షులుగాను, కార్యనిర్వాహక సంఘాధ్యక్షులుగాను, కుమారమనీంద్ర దేవరాయి, (బెంగాలు) యన్. సి. కల్కారు (మహరాష్ట్ర), సి. వి. రఘునాధ అయ్యర్ (పుదుక్కోట), కే. వి. కృష్ణస్వామి అయ్యరు (మద్రాసు), యస్. యం. దత్తు (బరోడా), రావు బహద్దరు 'యం. శ్యామారావు (మైసూరు), లాలా లభూరాం (లాహెూరు), పండిత పుష్కరనాధరామ్నా (దర్భాంగా), జస్టిసు కేశవరావు (హైదరాబాదు) గార్లు ఉపాధ్యక్షులుగాను ఎన్నుకోబడిరి, అయ్యంకి వేంకటరమణయ్య గారు కార్యదర్శిగాను దాసు త్రివిక్రమరావుగారు సంయుక్త కార్యదర్శిగాను, కళా వెంకట్రావు