Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రుల యొక్కయు సహాయము వల్లను తొలుదొల్త 400 సంస్కృతాంధ్రాంగ్లేయ గ్రంథములతో స్థాపించితిమి, పిదప శ్రీరామ కరుణా కటాక్షమువల్ల నేటికి 700 వందలవరకు గ్రంథముల చేకూర్పజాలితిమి.

ఈ గ్రంథాలయమునకు ఆంధ్రభాషలో బ్రకటింపబడుచున్న మాసపత్రికలు, వారపత్రికలు, దినపత్రికలు తెప్పింప బడుచున్నవి. మఱియు నిత్యము పురాణపఠనమును వారమున కొకటి రెండు సార్లు హరిభజనయును జరుపబడుచున్నవి. బాలుర కుచితముగ విద్యయు జెప్పబడుచున్నది. కాని పై గ్రంథాలయమునకు ప్రత్యేకముగ గృహమొండు లేని కతన పెక్కు యిక్కట్టులకు లోనుగావలసి వచ్చు చున్నది. యేతద్గృహనిర్మాణమునకు యెంతగా యత్నించినను ధనాభావముచే నింతదనుక కొనసాగదయ్యె. నేడు గృహనిర్మాణమునకు స్థలనిర్ణయమైనది. ధర్మకార్యాభిలాషులకు తమసహాయమే కొఱతపడి యున్నది. మా సాలూరు తాలూకా కిది యొక్కటి మాత్రమే ధర్మగ్రంథాలయము. దీని నభివృద్ధిపఱచుటకు తోడ్పడెదరని పార్థించుచున్నాము.



నాల్గవ అఖిలభారత గ్రంథాలయ ప్రదర్శనము

అఖిలభారత గ్రంథాలయసభతోబాటు గ్రంథాలయ ప్రదర్శనము 1928 సంవత్సరము డిశంబకు నెల 24వ తేదీ మొదలు 28 వ తేదీ వరకు కలకత్తా విశ్వవిద్యాలయ భవనమున జరిగినది. ఈప్రదర్శనమును 24 వ తేదీన కలకత్తా విశ్వవిద్యాలయముయొక్క వైసు ఛాన్సిలరుగారు తెరచుచు ఇటుల జెప్పిరి : విశ్వవిద్యాలయ భవనములందు ఈగ్రంథాలయ సభయును, ప్రదర్శనమును జరుగుచుండుట మాకు గొప్ప విశేషము. హిందూ దేశముయొక్క వివిధ రాజధానులందు గ్రంథాల యోద్యమమందు పనిజేయు వివిధజనులు కలసికొనుటకు ఇది