గిరి. ఈవత్సరము నందు రెండుబీరువాలు కొనబడినవి. 3౧ పత్రికలు వచ్చుచున్నవి. ౨౮౯ గ్రంథములు ఉచితముగా సంపాదింపబడినవి. ఈగ్రంథాలయమందు రు ౧౫౦౦ కిమ్మతుగల 1726 పుస్తకములు గలవు. పురుషులకు ఇండ్లకు 1777 గ్రంథములును, స్త్రీలకు 360 పుస్తకములును ఇయ్యబడినవి. ఈ గ్రంథాలయమందు రు 208 లు కిమ్మతుగల 6 బీరువాలు గలవు.
- విరియాల కామరాజు,
- జమ్మలమడక గోపాలం,
- సంయుక్త కార్యదర్శులు.
శ్రీ రామ గ్రంథాలయము
శివరామ పురము, విశాఖపట్న మండలము
మన మెల్లరము నాంధ్ర దేశమందు జన్మించి యాంధ్రుల మనుపేరిట వెలయు చున్నాము. పై పేరును సార్దకము చేసికొనుటకును పవిత్రవంతమగు దేశభాషను పెంపొందించుటకును, అందుండు సంశయములను నివృత్తి చేసికొనుటకును గల పునాది యెద్దియనిన “గ్రంధాల యోద్యమమే” యని తామెఱుంగుదురు. దేశీయ విద్య, దేశసేవ, దేశవస్తు ప్రోత్సాహములు పెంపొందింపజేసి మన పూర్వపు ఔన్నత్య స్థితికి దేశమును గొనివచ్చునదీ యుద్యమమే! భారతదేశము యొక్కయు, భారతీయుల పవిత్ర చరిత్రలున్ను, భారత ధర్మమును, అవతారపురుషుల చరిత్రలున్ను మనము తెలిసికొని యజ్ఞానాంధకారమునుండి విముక్తుల మగుటకు గ్రంథములే ముఖ్యాధారములు. పై పేర్కొనిన వానినెల్లరు సంపాదించుట కష్టసాధ్యము. గావున నట్టి గ్రంథములను సంపాదించుటకును, దేశభాషా సేవకులను వృద్ధి చేయుటకును గ్రంథాలయములే శరణ్యములని గ్రహించి యీ మా శివరామపురాగ్రహారమున "శ్రీరామ గ్రంథాలయ” మను పేరిట ధర్మ పుస్తక భాండాగార మొండు 1921 సం॥రమున గ్రామస్తుల యొక్కయు,