కింపబడినప్పటికిని, అక్షరాస్యులు కాని జనసామాన్యము యొక్క జ్ఞానాభివృద్ధికిగాను అనేక మార్గములు అవలంబింపబడి యున్నవి. హరికథలు, పురాణ శ్రవణములు, భాగవతములు, జంగము కథలు మున్నగునవి యన్నియు జనసామాన్యముయొక్క జ్ఞానాభివృద్ధికొరకే ఏర్పడినవి. అక్షరజ్ఞానము లేని పాటకపు జనులచే రచియింపబడి, తరతరముల నుండి, ముఖాముఖిని ప్రచార ముగుచున్న గాధలను జూచిన, మన జాతియొక్క అద్భుతమగు ఆధ్యాన్ని కొన్నత్యము గోచరించును. ఆగాధల యందలి దయారసము, శోరకసము: మెరుగుపూతలు లేని కధ, ఇవి యన్నియు విద్యాగంధ మెరుంగని సామాన్య జనుల మనసు యొక్క వి కాసమును జ్ఞానాభివృద్ధిని దెలియ జేయుచున్నవి. ఆదినముల యందు విద్యయొక్క ఆదర్శము అక్షరములను నేర్చుకొనుట, వ్యాకరణమును జదువుకొనుట మాత్రముగాదు. నిద్రాణమై యున్న ఆత్మను దీపింప జేసి, పౌరునికి గావలసిన సన్మార్గజీవనమునకు గొని పోవుటయే విద్యయొక్క ఆదర్శము.
కాని ఇప్పుడా కాలములు మారినవి. జనసామాన్యమునందు జ్ఞానాభివద్ధి గలుగుటకు ఆదినములందు అవలంబింపబడిన పద్ధతులు నశింపుచున్నవి. ఔన్నత్యము ననుభవించిన ఆప్రాచీన కాలము చరిత్ప్రస్థము మాత్రమైనది. ఈ కాలమునకు దగినట్లు మనము వర్తింపవలెను. కొత్తదానికి స్థల మిచ్చి పాతమార్గము మారిపోయినది. నాగరికతాభివృద్ధికి మనము వెనుక బడగూడదు. అజ్ఞానాఁధ కారము నుండి మన సోదరులను సోదరీమణులను ఉద్దరించినగాని మన మొక్క అడుగైన ముందునకు వేయజాలము. జనసామాన్యము యొక్క విద్యయే మనవి నిమిషమున ఆలోచింపవలసిన విషయము. దీనికి ప్రాధమిక విద్యమాత్రము చాలదు. గ్రంథములు, పత్రికల మూలమున జ్ఞానాభివృద్ధి గావించుటకు తోడ్పడవలెను. విద్యా వ్యాపనకు గ్రంథాలయములు మిక్కిలి ఉపయుక్తములగు సంస్థలు. ఈదినములందవి ఉండక తప్పని సరియయ్యెను. పాశ్చాత్య దేశములందు గ్రంథాలయములను పుస్తక సముదాయము లుంచు స్థలములుగా పరిగణించుట లేదు. గ్రంథాలయములే జాతీయజీవనమునకు రంగస్థలములుగ బరి