సిన సహాయమును గూడ జేయుచుండిరి. పదునొకటవ శతాబ్దము నందు భోజమహారాజు మిక్కిలి ప్రాముఖ్యములగు గంధ రాజములను అమితముగ సేకరించెను. చాళుక్యులు మాళ్వ దేశమును జయించి నప్పుడు ఈ గ్రంథములను వారు తమగ్రంథాలయమునందు జాగ్రత్త పరచిరి. చాళుక్య రాజులలో నొకరగు పిశాల దేవుడు ఈగ్రంథాలయమునకై విశేష ద్రవ్యమును వెచ్చించెను.
విశాల దేవుని గ్రంథాలయమునకు చెందిన శ్రీమద్రామాయణ వ్రాతపతియొకటి జర్మనీ దేశమందున్న “బో౯” విశ్వవిద్యాలయమునకు జేరినది. అనేక జర్మనీ దేశ గ్రంథాలయములందు అపూర్వములగు సంస్కృత వ్రాతపతు లెన్ని యోగలవు. నేపాళము, జుమ్మూ, మైసూరు, బికనీరు, ఆళ్వారులందు వ్రాతప్రతులు అనంతములుగు సేకరింపబడియున్నవి. వీటిన్నింటిలోకి తంజావూరుమహలు గ్రంథాలయము గొప్పది. దీనియందు 18,000 వ్రాతప్రతులు గలవు. నవీన కాలమందలి గ్రంథాలయములందు నేటిదినమున ఇక్కడ గ్రంథాలయ ప్రదర్శనమును దెరచిన “చాఫ్ మెక్” గారు గ్రంథ భాండాగారిగా గల కలకత్తా ఇంపీరియల్ గ్రంథాలయమును మద్రాసు నందలి కన్నిమ్మరా గ్రంథాలయమును పూనాయందున్న భండార్కారు గ్రంథాలయము సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీ గ్రంథాలయాములును, బరోడా యందుగల కేంద్ర గ్రంథాలయమును విశేష ప్రఖ్యాతిని జెందినవై యున్నవి.
హిందూ దేశమున మానవ జీవితము యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్య భాగము విశేషాభివృద్ధిని గాంచినప్పటికిని, ప్రాపంచిక వ్యవహార భాగము కూడ ఉపేక్ష చేయబడియుండలేదు. హిందూ దేశము భోగభూమిగ గాక, కర్మభూమిగ విఖ్యాతి జెందినది. కర్మయొక్క ఉత్తమ భావము నిష్కామము. అనగా పనియొక్క ఫలితమును తాను కోరక పరాత్పరునికి విడచిపెట్టుట: ఈ దేశమున మానవ జీవితము యొక్క వివిధమార్గములు హెచ్చు తగ్గులు లేని శాస్త్ర కట్టుబాటులవలన నడువబడుచున్నవి. జనసామాన్యము తృణీకార భావముతో జూడబడి యుండలేదు. వేదాధికారము ద్విజులకు మాత్రము ప్రత్యే