రాజ బంధువులును కూడ తమ మందిరముల యందు గ్రంథాలయములను గలిగి యుండిరి. ప్రాచీనపండితులు, చతుష్పతుల యొక్క అధ్యాపకులు స్వంత గ్రంథాలయములను గలిగియుండిరి. దేవాలయములందు వాతప్రతులను సంరక్షించుట మతధర్మముగ నెన్న బడుచుండెను. వేదాంతగ్రంథముల యొక్క ప్రతులను వ్రాయుటగూడ బౌద్ధ సన్యాసుల దినచర్యయందొక భాగముగ నేర్పడెను. మత గ్రంథములను ప్రత్యేకముగ సంరక్షించుట జైన భిక్షువుల విధిగ నేర్పడెను. అట్టి జైన గ్రంథాలయము లిప్పటికిని పశ్చిమ హిందూ దేశమందు "కేంబే” జసల్ నిూర్, “సూరతు” పట్టణములందు చూడగలరు.
క్రీస్తునకు పిమ్మట నాలుగైదు శతాబ్దములందు గుప్తవంశపు రాజుల పరిపాలనయందు మన దేశయిన విద్యా ప్రాభవము మిక్కిలి ఉచ్ఛదశయందుండెను. “స్మిత్తు” వ్రాసిన ప్రచురము క్రీస్తునకు పిమ్మట 800 సంవత్సరములు మొదలు 650 సంవత్సరముల వరకు గుప్తశకము. ఇంగ్లాండు దేశమున ఎలిజబిత్తు స్టూఆర్టు, శకములవలెనే ఈ శకముగూడ హిందూదేశమున విద్యాభివృద్ధి విషయమున మిక్కిలి అభివృద్ధిని జూపినది. ఈ యుగమునందే విఖ్యాతిగాంచిన విక్రమాదిత్యుని యాస్థానమునందు నవమణులని ప్రఖ్యాతిగాంచిన యశోవంతులు విలసిల్లిరి. వీరు ఆవిషయము యీవిషయమని జెప్పనేల శారీర శాస్త్రము మొదలు, వ్యాకరణ శాస్త్రము వరకు అన్ని విద్యలయందును నిధులని విఖ్యాతి గాంచిరి.
గుప్త శకాంతరమున భారతవర్షము అనేక చిన్న రాజ్యముల కింద చీలిపోయినది. ఈ చిన్న రాజులలో గూడ కొందరు ప్రాచీన వ్రాతప్రతుల సంరక్షణయందు విశేష శ్రద్ధాభక్తులను గలిగియుండిరి. మహమ్మదీయుల పరిపాలనయందు హుమాయూన్, అక్బరు, జహంగీరు, ఫిరోజిషా చక్రవర్తులు యీ విషయమున మిక్కిలి ఔదార్యమును జూపిరి. వారికి లోబడియుండిన కొందరు హిందూ రాజులు కూడ జానవ్యాపనమునకై అమితవ్యయమును జేసిరి. వారు వ్రాతస్త్రతులను సంపాదించుటయేగాక, విఖ్యాతిగాంచిన పండితులను తమ యాస్థానముల యందుంచి పోషింపుచు, జ్ఞానసముపార్జనాపరులకు గావల