భానుడు ఉదయించినప్పుడు పవిత్రవంతములగు నదీ తీరములందు ఋషిపుంగవులు వేదఘోష జేయుచుండిరి. వ్రాత సాధనములు వెలయువరకు ఈఋషి వుంగవులు తమయొక్క జ్ఞానామృతమును శిష్యప్రశిష్యుల చేత వ్యాపింపజేయుచుండిరి. పిమ్మట గ్రంథపత్తులను తాళపత్రముల మీదను, భూర్జరపత్రములమీదను వ్రాయుచుండిరి. ఇట్టి గ్రంథముల యొక్క సమీకరణమే మన దేశ గ్రంథాలయములకు ప్రాతిపదిక యయ్యెను. గ్రంథాలయమను నది ప్రత్యేకముగా పాశ్చాత్య సంస్థయని కొందరు చెప్పెదరు, సంస్కృత పరిజ్ఞానముచే పావనవంతంబైన భారతవర్షమునందు గ్రంథాలయములు బొత్తిగా నూతనములుగావు. తక్షశిల, నలంద, విక్రమశిల, ఉదంతపురి మున్నగు ప్రాచీన విశ్వవిద్యాలయములందు వేలకొలది వ్రాతప్రతులను జాగ్రత చేయుచుండిరి. హిందువుల దేవాలయములందును, బౌద్ధుల విహారము లందును, మఠములందును మతవిషయికమైనట్టియు, వేదాంత సంబంధమైనట్టియు, గ్రంధముల సముదాయములను మిక్కిలి జాగ్రతతో భద్రము జేయబడుచుండెను, “నలంద విశ్వవిద్యాలయమందు “రత్నదధి” యను పేరుగల తొమ్మిది అంతస్థులుగలిగిన గొప్ప మేడయందు విశ్వవిద్యాలయ గ్రంధ భాండార ముంచబడెను. గ్రంథాలయము అమూల్యములకు గ్రంధ రాజములచే నొప్పారి మిక్కిలి గొప్ప గ్రంథాలయముగ విరాజిల్లెను. ఏడవ శతాబ్దమున చీనా యాత్రికుడగు "హ్యూనుత్స్యాంగు” భారతవిజ్ఞానమును గ్రోలుటకై మనదేశమునకె తెంచినప్పుడు నలంద విశ్వవిద్యాలయము న నేక సారులు దర్శించెను. ఈ గ్రంధాలయము ఎనిమిదవ శతాబ్దము నందు క్షీణించెను. విక్రమశిల, ఉదంతపురిల యందుగల గొప్ప గ్రంథాలయములు పాల్ రాజుల కాలమున ఉన్నతస్థితి యందుండెను. పదమూడవ శతాబ్ద ప్రారంభమున “భక్తియార్ ఖిల్జీ” యొక్క దండయాత్ర యందు యీ గ్రంధాలయములు నాశనము గావింపబడినవి. ఈ గ్రంధాలయములను సంరక్షించుచుండిన కొందరు బౌద్ధసన్యాసులు కొన్ని అమూల్య గ్రంథములను మాత్రము తీసుకొని నేపాలు దేశమున కేగిరి. ఈ విశ్వ విద్యాలయ గ్రంధాలయములేగాక ఆకాలమున రాజులును
పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/6
స్వరూపం