గ్రామమందున్న గ్రంథాలయము యొక్క యుపయోగము అగ్రంథాలయము యొక్క భవనమును బట్టిగాని, దానియందున్న గ్రంథముల సంఖ్యను బట్టి గాని, నిర్ణయించుటకు వీలులేదు. గ్రంథాలయము గ్రామ జీవనమునకు కేంద్ర స్థానము గ్రామమందలి జనులందరును కూడి మంచి చెడ్డలను గూర్చి చర్చించుకొనుట కది కూడలిస్థలము. గ్రామమంతకును, అది ఏర్పాటులను జేయు స్థలము.
స్వదేశ సంస్థానములందు గ్రంథాలయోద్యమము ఎక్కువగా వ్యాపించుచున్నది. బెల్గాంనగరమున జరిగిన అఖిలభారత గ్రంథాలయ సభయందు జేరి ఆసభను చాలవరకు నడపితిని. ఆంధ్రదేశము నుండి వచ్చినవారే ఆసభకు జీవనమై నడపువారని నేను కనుగొంటిని. మైసూరు, బరోడా రాష్ట్రములందు ఈయుద్యమము మిక్కిలి ఉచ్చదశయందున్నది. పా ప్రతి గ్రామమందున్న గ్రంథాలయమును ఆగ్రామముయొక్క ఆర్థిక చరిత్రను తయారు జేయ వలయుననునది మీ తీర్మానములలో నొకటి. అది చాలమంచిపని. భారతవర్ష మంతకును ఆర్థిక విచారణను చేయవలసినదని “అసెంబ్లీ” యందు తీర్మానమును ఉపపాదించి నప్పుడు దానిని తోసివేయవలెనని ప్రభుత్వము వారు యోచించిరి. తుదకు.ఆపనికై ఒక కమిటిని వేసిరి. ఈకమిటీకి అధ్యక్షులగు విశ్వేశ్వ రయ్యగారితో నేను మాట్లాడియుంటిని. అధికారేతర సంఘముల యొక్క సహాయము యీ విషయమున అవసరమనియు, కుటుంబ ఆదాయ వ్యయములను గూర్చిన సంగతులు తెలిసికొనుట ఆవశ్యకమనియు మేము యోజించితిమి. ఈవిషయమున గ్రంథాలయములు తోడ్పడ గలవు.
గ్రంథాలయములు - నాడు - నేడు
ఈ దేశము యొక్క విద్యావ్యాసంగ చరిత్ర ఉన్న తాదర్శముల తోను ప్రావీణ్యముతోడను నిండియున్నది; కొన్ని శతాబ్దములకు పూర్వదేశము స్వాతంత్య్రము గోల్పోయినప్పుడు దానియొక్క క్రమ వికాసమునకుగూడ భంగము వాటిల్లెను. భారతవర్షమున నాగరికతా