Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొకసంగతి జ్ఞాపకమునకు వచ్చినది. జర్మనీ దేశమందున్న” “హిండె న్బర్లు” పట్టణమునందు నేనున్నప్పుడు సామాన్యుడగు ఒక పిల్లవాడు పట్టణమంతయు జూపించెదనని నావద్దకు వచ్చినాడు. వానికి ఇంగ్లీషు భాష కొద్దిగావచ్చును. కాని ఫ్రెంచి భాష బాగుగా వచ్చుటచే ఆభాషయందే వానితో చాల సేపు మాట్లాడితిని. ఆపిల్లవాడు బాగుగా చదువుకొన్నాడు. ఆచదువంతయు ఆ పట్టణమందున్న ఒక పౌర గ్రంధాలయమందలి గ్రంథములను జదువుటవలననే ఆపిల్లవానికి లభించినదని తెలిసికొంటిని. ఈ పౌరగ్రంథాలయములు అచటి ప్రభుత్వము వారిచే నిర్వహింపబడు ఉచిత ధర్మ గ్రంథాలయములు. నేను జర్మనీకి బోయిన రోజులు యుద్ధపు కాలము. అప్పుడు ఆ దేశమందలి జనులకు రోజుకు రెండుసారులుకూడ భోజనములేదు. అట్టి స్థితియందుకూడ ఈగ్రంధాలయములకు మాత్రము ఎట్టికరువును లేదు. యుద్ధ సమయమగు 1914 సంవత్సరమున మన దేశ ఆదాయము 76 కోట్లనుండి 130 కోట్లకు బెరిగెను. కాని విద్యావిషయమునను ఆరోగ్యవిషయమునను, యేమాత్రమును అభివృద్ధిలేదు. అట్టిదేమైన ప్రభుత్వము వారివల్ల సహాయ మపేక్షింపకుండ మన స్వశక్తి చేతనే చేసికొనవలసి యుండెను. మనము పరస్పర సహాయముతో దేశాభివృద్ధికై పాటుపడవలసి యున్నది. మన పల్లెటాళ్ళమీదనే భారత జాతియొక్క అభివృద్ధి యంతయు ఆధారపడియున్నది, అందుచేత, పల్లెటూళ్ళ యొక్క ఐశ్వర్యమభివృద్ధి చేయుటయే మన ప్రాప్యము. నేను లెజిస్లేటివ్ అసెంబ్లీలో సంవత్సరమున్నర కాలను సభ్యుడుగా నుంటిని. జనులయొక్క యథార్దమైన అభివృద్ధికి వలయు పనులకు ద్రవ్యమును ఖర్చు బెట్టించుటకు ప్రభుత్వమువారిని బలవంత పెట్టజాల మైతిమి. మీ తీర్మానములందొక దానియందు జిల్లాబోర్డులను లోకులు బోర్డులను ద్రవ్యసహాయము చేయవలసినదని అడుగుట యున్నది.

కాని ఈసఁస్థలు వాని నిత్యకృత్యములకే సొమ్ముచాలని స్థితిలో నున్నవి. ప్రధాన బాటలను మరమ్మతుగూడ చేసికొనజాలని స్థితిలో నున్నవి. మనము సహాయముకొరకు ఇతరులను అడుగుకుందుముగాక. మనకున్న మార్గము లన్నింటిని వినియోగించి పనిచేయుదము. ఒక