హుగ్లీ జిల్లా గ్రంథాలయసభ
(అధ్యక్షులకు తులసిదాస్ గోస్వామి గారి యుపన్యాసము)
ఇతర దేశములందు ప్రాచీన కాలమందున్న గొప్ప గ్రంథాలయములను గూర్చి మనము వినియుంటిమి. "బొడ్లియ౯" గ్రంథాలయము వంటిదిగాని “బ్రిటిషు మ్యూజియము” వంటిదిగాని, మనకు లేక పోయెనని చాలనుంది విచారించినారు. మన దేశమందట్టి గ్రంథాలయ ములుండుట అత్యంతావశ్యకము. కాని, ప్రభుత్వముయొక్క సహాయముండినగాని అట్టివి స్థాపింపబడజాలవు. ఇంగ్లాండు దేశమందు ముద్రింపబడిన గ్రంథము లన్నింటియొక్క ఒక్కొక్క ప్రతిని “బ్రిటిషు మ్యూజియము" నకు పంపవలెనని ఆ దేశమందు చట్టముగలను. అందుచేత దేశమందు ప్రచురింపబడు ఎట్టి చిన్న గ్రంథ మైన ఆ గ్రంథాలయ మందుండును. “బొడ్లియ౯” గ్రంథాలయ మందుగూడ అచ్చుపడిన గ్రంథము లన్నియుగూడ గలవు. “జాతికి అర్హమైన గ్రంథాలయమే లభించును” అని “ఛాఫ్ మ౯” గారు నిన్నటి సాయంకాలము చెప్పినారు. వారు చెప్పిన మాటలను బట్టియే కలకత్తా ఇంపీరియల్ గ్రంధాలయము వైస్రాయిలలో నొకరగు లార్డుకర్జ౯ గారిచే స్థాపింపబడిన దనియు, పిమ్మటీ గవర్నరులును వైస్రాయిలును దానియెడల ఏమాత్రము శ్రద్ధయును వహింపలేదని అందుచేత ఒక దేశ ప్రభువులు విద్యావ్యాసంగము కలిగిన వారైన యెడల ఆ దేశమందలి గ్రంథాలయము లభివృద్ధి జెందుననియు లేనియెడల అభివృద్ధి జెందవనియు తేలుచున్నది. కాన నేనిట్లు చెప్ప సాహసించెదను, "జాతికి లభించిన గవర్నరులనుబట్టి గ్రంథాలయము లుండుము." నాకు ఇం