నిఘంటువులు, రాజకీయములు, ప్రహసనములు మున్నగు గ్రంథరాజములు గలవు.
ఈ గ్రంథాలయమునకు ప్రకృతము ఆంధ్ర దినపత్రిక సమదర్శిని వ్వైవారపత్రిక, భారతి, వాసవి, రెడ్డిరాణి, రాష్ట్రేతర ఆంధ్రులు, బొంబాయి తెలుగుసమాచార్, గ్రంథాలయ సర్వస్వము మున్నగు మాసపత్రికలు చేరుచున్నవి.
ఈ పురమునందలి ఆంధ్రులు పెక్కండు ఈ గ్రంథాలయమునకు చందాదారులుగా చేరి పొత్తములగైకొని చదివి సంతసింపు చున్నారు. గ్రంధాలయము నిరంతరాయముగ దిన దినాభివృద్ధి నొందుచున్నది.
వాఙ్మయాభివృద్ధికి మొదటి మెట్టనదగు గ్రంథ పఠనార్థమై ఈ గ్రంథాలయము రాష్ట్ర తరములయందు స్థాపింపబడి ఆంధ్రము చదువ నిచ్ఛగలిగియు శక్తి విహీనులగు వారి కెందరికో తత్సాకర్యలను ప్రసాదించు చున్నది.
౼ వీణా సుబ్బణాచారి
గౌరవ కార్యదర్శి
శ్రీ సహకార శారదా విద్యానిలయ పుస్తక భాండాగారము
కురుగొండ, నెల్లూరు జిల్లా
ఈ గ్రంథాలయము 27-4-28 తేదీన స్థాపింపబడినది. 30 మంది సభ్యులు, 200 గ్రంధములు గలవు. 5 పత్రికలు తెప్పింపబడు చున్నవి. రు 100 లు మూల ధనము గలదు. రిజిష్టరు చేయుటకు ప్రయత్నించుచున్నాము.