Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనమందరమును సహకారోద్దేశముతో సదభిప్రాయముతో కలసి, ఈ గ్రంథాలయముల స్థితిని అభివృద్ధి పరచుటకును ఇవి ఇంకను ఎక్కువగా జనుల కుపయోగపడు మార్గములను గూర్చియు స్థిరస్థాయిగా నుండు మార్గములను గూర్చియు యోజించుటకును పూనుకొందుమేని, ఈ యుద్యమము జయప్రదమగుట కేమయు సందియములేదు. ముఖ్యమగు గ్రంథాలయము లన్నియు స్త్రీలకు, పిల్లలకు, చదువురాని వారికి ప్రత్యేక శాఖలను గలిగి యుండవలెను. సంఘసేవయు, గ్రామపునర్నిర్మాణమును వానియొక్క పనుల యందు చేర్చుకొనవలెను. గ్రంథాలయములు జ్ఞాన ధనముయొక్క పేటికలు. అందు చేత ప్రతివారును ఈ గ్రంథాలయ ఉపయోగమును పొందునటుల జూడవలయును. పౌరుని కుండవలసిన యోగ్యతలను పొందుటకును, ప్రజాపాపాలన పద్ధతి నలవరచు కొనుటకును గ్రంథాలయము తరిబీతుస్థానముగా నుండ వలయును. దానియందు పోట్లాటలు చేరగూడదు. జాతి, కులము, రంగు మున్నగు విభేదములు లేక, పరస్పర సహనమును, ఓర్పును అలవరచుకొనుటకు అందరికి ఇది రంగస్థలము. అది సరస్వతీ దేవియొక్క పవిత్రవంతమగు ఆలయము. అక్కడనుండి యోగ్యతయు పవిత్రతయు ప్రసరించుచుండును.


ఆంధ్ర గ్రంథాలయము, కల్యాణి

బొంబాయి నగరమునందొక భాగమగు ఈపురమునపై గ్రంథాలయమును శ్రీయుతులు మండ రామమూర్తిగారిచే తెఱవబడినది. పలువురు గ్రంథముల నొసంగి తోడ్పడిరి. ఇందు పురాణములు, పద్యకావ్యములు, గద్యకావ్యములు, చరిత్రలు, ఇతిహాసములు, కథలు, నవలలు, నాటకములు, వ్యాకరణములు, ఛందశ్శాస్త్రములు, శబ్దశాస్త్రములు, అర్థశాస్త్రములు,