గ్రంథాలయములు ఇంకే దేశమందును వ్యాపించి యుండలేదు. జన సామాన్యముదు జ్ఞానమును వ్యాపింపజేయవలయునను ఈ సదభిప్రాయము హిందూ చేశమునందు వివిధ భాగములందు వ్యాపించుచున్నది. చదువుకొనజాలని జనుల ఉపయోగార్థమయి బరోడాయందు ప్రదర్శనశాఖ యేర్పరుపబడినది. ఈ శాఖయందు మాజిక్ లాంతర్లు, సినిమోటోగ్రాఫులు, స్టీరియోగ్రాఫులు, స్టీరియోస్కోపులు మున్నగు మోటోగ్రాఫులు, స్టీరియోగ్రాఫులు వానిచే బొమ్మలను చూపుచు వారికి ఉపన్యాసములు నిచ్చెదరు.
బరోడా మహారాజుగారిచే ప్రారంభింపబడిన ఈ మహత్కార్యము భారతవర్షమున ఇతర భాగములందు కూడ అవలంబింపబడు చున్నది. ఆ మహారాజు చెప్పిన ఈ క్రింది వాక్యములు గమనింప తగియున్నవి:౼
“గ్రంథమును మన జీవితమునందొక భాగముగ జేసికోవలెను. గ్రంథాలయములు ఆవశ్యకములుగాని, విలాసములుగావు” భాగముల బొంబాయి సేవాసంఘమువారు సంచార గ్రంథాలయ పేటికలను ఏర్పాటు జేసి అమెరికా బరోడా పద్ధతులమీద గ్రంథములను జనుల కంద జేయుచున్నారు. గ్రంథములను ఒక చోట పోగుజేసి వానిని భద్రపరచి కావలసినవారి కిచ్చుట యనునది తాతలనాటి పాతయభిప్రాయము. గ్రంథాలయము చదువరియొద్ద కేబోయి, సంఘమునందున్న అన్ని తరగతులవారికిని జ్ఞానము కలుగ జేయ వలయుననునది ఈ కాలముయొక్క అభిప్రాయము. కృష్ణా, గోదావరి డెల్టా యందున్న ఆంధ్రదేశము గ్రంథాలయోద్యమునకు విశేషమైన అభివృద్ధిని జూపినది. బరోడా మహారాజుగారి మార్గమును వారు అనుసరించిరి. వారు 550 గ్రంథాలయములను స్థాపించిరి. అందు 25 గ్రంధాలయములు పాఠ శాలలను నిర్వహించుచున్నవి. పురాణపఠనము ఈ గ్రంథాలయములందున్న ప్రత్యేక విశేషమై యున్నది. పోటీపరీక్షలు పెట్టుటవలనను, వారికి బహుమతు లిచ్చుటవలనను, పాఠశాలలందలి పిల్లలకు అభిరుచిని గలుగ జేయుచున్నారు. కొన్ని గ్రంథాలయములకు అట్టి పరపతి సంఘములు నిర్వహింపబడుచున్నవి. కొన్ని గ్రంథాలయములు ధర్మములను చక్కగా నిర్వహించుచున్నవి. జాతీయ పండుగలను